తిరుమల, తలనీలాలు.. ఓ చంద్రబాబు..

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి తెలుగురాష్ట్రాల్లో ప్రజలందరూ జీవితంలో అప్పుడో ఇప్పుడో ఒక్కసారైనా వెళ్లి ఉంటారు. ఆ శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన తలనీలాలను ఇచ్చి ఉంటారు. తిరుపతికి వెళ్లిన ప్రతి ఒక్కరు తలనీలాలు ఇవ్వడం ఆనవాయితీ.. అదో సంప్రదాయం.. లేకుంటే అపచారం.. అనర్థం అని అంతా భావిస్తారు.. Also Read: సెలవులంటే ఆ అధికారికి భయం పట్టుకుంది కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా.. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తన జిల్లాలోని […]

Written By: NARESH, Updated On : January 5, 2021 7:23 pm
Follow us on

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి తెలుగురాష్ట్రాల్లో ప్రజలందరూ జీవితంలో అప్పుడో ఇప్పుడో ఒక్కసారైనా వెళ్లి ఉంటారు. ఆ శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన తలనీలాలను ఇచ్చి ఉంటారు. తిరుపతికి వెళ్లిన ప్రతి ఒక్కరు తలనీలాలు ఇవ్వడం ఆనవాయితీ.. అదో సంప్రదాయం.. లేకుంటే అపచారం.. అనర్థం అని అంతా భావిస్తారు..

Also Read: సెలవులంటే ఆ అధికారికి భయం పట్టుకుంది

కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా.. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తన జిల్లాలోని తిరుమలేశుడికి ఒక్కసారి కూడా తలనీలాలు ఇవ్వలేదట.. ఇప్పుడు విజయనగరం రామతీర్థం పేరిట రచ్చ చేస్తున్న చంద్రబాబుకు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు వేసిన ప్రశ్న ఇదీ..

అసలు చంద్రబాబు నాస్తికుడు అని.. ఆయన దేవుడినే నమ్మడని మంత్రి అవంతి కడిగిపారేస్తున్నాడు. అపర హిందువుగా చెప్పుకుంటున్న బాబు.. సడెన్ గా హిందుత్వ ఎజెండా పట్టుకోవడంపై ఆయన దుమ్మెత్తి పోస్తున్నారు.

Also Read: ఏపీలో ఆలయాల యాత్ర..: చినజీయర్‌‌ పిలుపు

సాధారణంగా సీఎంలు, మంత్రులు లేదా ఉద్యోగం వచ్చినప్పుడు.. ఏదైనా పదువులు వచ్చినప్పుడు అందరూ తిరుమల వెళ్లి గుండు కొట్టించుకుంటారు.కానీ ఇన్ని పదవులు అలంకరించినా.. తిరుమలకు కాలినడకన వెళ్లినా కూడా చంద్రబాబు తలనీలాలు సమర్పించలేదని ఇరుకునపెట్టే పాయింట్ ను లేవనెత్తాడు మన అవంతి శ్రీనివాస్. బీజేపీ లేవనెత్తిన అంశాలు పట్టుకొని చంద్రబాబు కూడా మత రాజకీయాలు చేస్తున్నాడని దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు ఊసరవెళ్లి అంటూ ఈ పాయింట్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి అవంతి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్