
భారత్ లో డయాబెటిస్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎవరైతే సరైన ఆహార నియమాలను పాటిస్తూ రోజూ వ్యాయామం చేస్తారో వాళ్లు మాత్రమే డయాబెటిస్ బారిన పడిన పడకుండా ఉంటారు. కొందరు వంశపారంపర్యంగా షుగర్ వ్యాధి బారిన పడుతుండటం గమనార్హం. గతంలో 60 సంవత్సరాలకు పై బడిన వాళ్లు మాత్రమే షుగర్ బారిన పడగా ప్రస్తుతం 30 ఏళ్ల వయస్సు వాళ్లకు కూడా షుగర్ నిర్ధారణ అవుతూ ఉండటం గమనార్హం.
ఇప్పటికే ఈ వ్యాధితో బాధ పడుతున్న వాళ్లు తగిన ఆహార నియమాలను ఖచ్చితంగా అదుపులో ఉంచితే మాత్రమే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అయితే షుగర్ తో బాధ పడేవాళ్లు పాలు తాగవచ్చా..? తాగకూడదా..? అనే విషయంలో చాలామందిలో సందేహాలు ఉన్నాయి. అయితే షుగర్ రోగులు ఎలాంటి ఆందోళన చెందకుండా పాలను తీసుకోవచ్చు. యూనివర్శిటీ ఆఫ్ టొరంటో ప్రతిరోజూ షుగర్ రోగులు పాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తోంది.
ప్రతిరోజూ ఉదయం తృణధాన్యాలను అల్పాహారంగా తీసుకుని అనంతరం నీటికి బదులు పాలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్పాహారం సమయంలో పాలు తీసుకోవడం సాధ్యం కాకపోతే మధ్యాహ్న భోజనం తరువాత పాలు తాగితే మంచిది. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరుతాయి.
పాలలో ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ పాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వేడిపాలు తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రోజూ పాలు తాగితే నిద్రలేమి సంబంధిత సమస్యలు సైతం దూరమవుతాయి.