స్థానిక ఎన్నికల వ్యవహారం ఏపీలో తేలడం లేదు. ఓవైపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్.. మరోవైపు సీఎం జగన్ పట్టుబట్టి ఉండడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇప్పటికే స్థానిక ఎన్నికలపై అటు ఎస్ఈసీ నిమ్మగడ్డ హైకోర్టుకెక్కి ఎలాగైనా నిర్వహించాలని యోచిస్తుండగా.. జగన్ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ వైరం గత ఏడాదిగా ఇరువురి మధ్య సాగుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులకు చేరింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న నిమ్మగడ్డకు ఏపీ ప్రభుత్వం సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు.
Also Read: పవన్‌పై వైసీపీ ఎదురుదాడి
తాజాగా ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఆదేశాలిచ్చింది. నేటి నుంచి మూడు రోజుల్లోపు ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కలవాలని పేర్కొంది.
అధికారులు ఎక్కడ కలువాలన్న విషయాన్ని నిమ్మగడ్డ తెలియజేస్తారని కోర్టు తెలిపింది. ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్తితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన వివరాలను అధికారులు నిమ్మగడ్డకు వివరించాలని హైకోర్టు తెలిపింది.
Also Read: రైతుబంధుకు ఖజానా కష్టాలు
దీంతో ఈసారి ఎలాగైనా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే చాన్స్ కనిపిస్తోంది. అయితే హైకోర్టు ఆదేశాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు జరుగుతాయా? లేదా అన్నది వేచిచూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్