టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. తెలంగాణలో బీజేపీ ఏం చేయాలనుకుంటోంది..?

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే ఎవరూ కాదనరు. పైగా ఆ నిరసనలతో కఠిన మనుషులైనా సరే కరిగి మనకు మేలు చేస్తారు. మన మహాత్మాగాంధీ అహింసతోనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు.అయితే గాంధీని కంటే గాడ్సేను అభిమానించే దేశభక్తులైన బీజేపీ నేతలు ఇప్పుడు విచ్చలవిడిగా విపరీత ధోరణితో ఆకృత్యాలకు పాల్పడడాన్ని టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక పద్దతిగా ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ఆ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్ళతో దాడి చేస్తారా..? అని నిలదీస్తున్నారు. స్వయానా టీఆర్ఎస్ వర్కింగ్ […]

Written By: NARESH, Updated On : January 31, 2021 8:53 pm
Follow us on

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే ఎవరూ కాదనరు. పైగా ఆ నిరసనలతో కఠిన మనుషులైనా సరే కరిగి మనకు మేలు చేస్తారు. మన మహాత్మాగాంధీ అహింసతోనే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు.అయితే గాంధీని కంటే గాడ్సేను అభిమానించే దేశభక్తులైన బీజేపీ నేతలు ఇప్పుడు విచ్చలవిడిగా విపరీత ధోరణితో ఆకృత్యాలకు పాల్పడడాన్ని టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక పద్దతిగా ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ఆ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్ళతో దాడి చేస్తారా..? అని నిలదీస్తున్నారు. స్వయానా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని నిలదీశారు. ఎమ్మెల్యే ఇంట్లో ఎవరున్నారో చూడకుండా.. పిల్లలున్నారా..ఆడవాళ్ళు ఉన్నారా అని చూడకుండా రాళ్ళు విసురుతారా..? అని ప్రశ్నించారు.

మొన్న సీఐపై దాడి, ఈ రోజు ఎమ్మెల్యే ఇంటిపై దాడి..బీజేపీ ఏం చేయాలనుకుంటుందని ఇతర పార్టీవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.. దేశంలో అధికారంలో ఉండి ఇదేనా సంస్కారం అని నిలదీస్తున్నాయి.. బీజేపీకి ఇదేనా రాజకీయం అని కడిగిపారేస్తున్నారు. ఒక ఆడవ్యక్తి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న బీజేపీ పార్టీ..ఈ రోజు ఎమ్మెల్యే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్న సమయంలో రాళ్ళు విసురుతారా..? అని వరంగల్ టీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

తెలంగాణా ను బీజేపీ మరో యూపీ చేయాలనుకుంటుందా అని గులాబీ దండు ప్రశ్నిస్తోంది. దమ్ముంటే ఎమ్మెల్యే ఏం తప్పు మాట్లాడాడో రుజువు చేసేందుకు సిద్దమా..? అని వరంగల్ టీఆర్ఎస్ నేతలు సవాల్ చేస్తున్నారు.

పచ్చగా ఉన్న తెలంగాణను రావణ కాష్టంగా ఈ బీజేపీ నేతలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీళ్ళ ఆగడాలతో రాష్ట్రం సర్వనాశనం చేస్తారని ఇప్పటికే కేటీఆర్ లాంటి నేతలు మండిపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.బీజేపీ నేతల దాడిని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు.