దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్ జరగ్గా మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 315 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 23 మంది పోటీ చేశారు. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్ చొప్పున 14 టేబుల్స్ వేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడనుంది.
Also Read: నువ్వు మగాడివి అయితే.. కేటీఆర్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడి కాగా.. మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు లీడ్‌లో ఉన్నారు. 341 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మొదటి రౌండ్‌లో బీజేపీ 3,208 ఓట్లు సాధించగా.. టీఆర్‌ఎస్ 2,867.. కాంగ్రెస్ 648 ఓట్లు సాధించాయి. తొలి రౌండ్‌లో దుబ్బాక మండలానికి చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కించారు. మరో వైపు రెండో రౌండ్‌లోనూ బీజేపీ తన ఆధిక్యతను చాటింది. 620 ఓట్లతో బీజేపీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి 1282 ఓట్లు రాగా.. బీజేపీకి 1561 ఓట్లు వచ్చాయి.
Also Read: బీహార్ కా షేర్ తేజస్వి..మోడీ-నితీష్ కు షాక్ యేనా?
అయితే.. మొదటి, రెండో రౌండ్ ఫలితాలు చూశాక.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గెలుపు తమదేనంటూ బీరాలు పలికిన టీఆర్‌ఎస్ ఇలా డీలా పడిపోవడంతో ఆ పార్టీ నేతల్లో నైరాశ్యం కనిపిస్తోంది. బీజేపీ లీడ్ కంటిన్యూ కావడంతో అసలు ఏం జరుగుతోందోననే అనుమానాలు టీఆర్‌ఎస్ పార్టీలో మొదలయ్యాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
మరోవైపు అర్బన్‌లలో చూస్తే బీజేపీకి లీడ్ ఉంటుందని.. గ్రామీణప్రాంతాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం వస్తుందని టీఆర్‌ఎస్ లీడర్లు అంటున్నారు. ఫైనల్‌గా తమదే విజయమనే భరోసాతో ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికను టీఆర్‌ఎస్‌తోపాటే బీజేపీ కూడా ఛాలెంజ్‌గా తీసుకుంది. రఘునందన్‌రావు గెలుపు కోసం అహర్నిషలు కృషి చేశారు. ఆ ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయని బీజేపీ లీడర్లు అంటున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం పెద్దగా పోటీనివ్వలేకపోతోంది