https://oktelugu.com/

బిగ్ బాస్-4: నాగార్జునను ట్రోల్ చేస్తున్న అభిఫ్యాన్స్.. ఎందుకంటే?

బిగ్ బాస్-4 సీజన్ చివరి అంకానికి రావడంతో గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. 12వ వారం ముగింపుకు చేరింది. నేడు బిగ్ బాస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారా? అనేది ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అభిజిత్ ను టార్గెట్ చేయడంతో అతడి బెంబేలెత్తిపోయాడు. Also Read: బిగ్ బాస్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన అభిజిత్.. మొకాళ్లపైపడి సారీ? అభిజిత్ ను కన్సేషన్ రూముకు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 02:32 PM IST
    Follow us on

    Nagarjuna

    బిగ్ బాస్-4 సీజన్ చివరి అంకానికి రావడంతో గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. 12వ వారం ముగింపుకు చేరింది. నేడు బిగ్ బాస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారా? అనేది ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అభిజిత్ ను టార్గెట్ చేయడంతో అతడి బెంబేలెత్తిపోయాడు.

    Also Read: బిగ్ బాస్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన అభిజిత్.. మొకాళ్లపైపడి సారీ?

    అభిజిత్ ను కన్సేషన్ రూముకు పిలిచి బిగ్ బాస్ క్లాస్ తీసుకున్నాడు. ఇక హోస్ట్ నాగార్జున అభిజిత్ లోని వివిధ షేడ్స్ చూపిస్తూ తోటి కంటెస్టెంట్ల ముందే ఫుట్ బాల్ ఆడుకున్నాడు. ఒక సమయంలో అభిజిత్ ను బయటికి పంపేందుకు గేట్లు కూడా ఓపెన్ చేశారు. ఈక్రమంలో అభిజిత్ మొకాళ్లపైపడి బిగ్ బాస్.. హోస్టు నాగార్జునకు సారీ చెప్పాల్సి వచ్చింది.

    నిన్నటి ఎపిసోడ్లో అభిజిత్ టార్గెట్ చేయడంతో అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. స్టార్ మా.. హోస్ట్ నాగార్జునపై ట్రోల్స్ చేస్తున్నారు. అభిజిత్ ను కావాలనే బిగ్ బాస్.. నాగార్జున టార్గెట్ చేస్తున్నారంటై #StopTargeting Abijeet #WeAdmireAbijeet అంటూ హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండ్లోకి తీసుకొచ్చారు. అభికి ఏమేరకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

    అభిజిత్ ను నాగార్జున టార్గెట్ చేయడంపై ఫ్యాన్స్ చేసిన కొన్ని మిమ్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ‘మెహబూబ్‌ను సోహెల్ సేవ్ చేసినప్పుడు హోస్ట్ నాగార్జున గానీ.. బిగ్‌బాస్ గానీ మాట్లాడలేదు.. అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుందంటూ’ సింహా చిత్రంలోని బాలకృష్ణ డైలాగ్‌ను మీమ్‌గా చేశారు. అలాగే మొనాల్ కు లేని మీద మీకు ఎందుకంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: ‘ఆదిపురుష్’లో కాస్ట్ కటింగ్.. మూవీపై ఎఫెక్ట్ పడుతుందా?

    మరికొందరు స్టార్ మా.. బిగ్ బాస్ యాజమాన్యం అభిజిత్ ను టార్గెట్ చేస్తూ పెద్ద తప్పు చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చెత్త స్క్రీప్టులతో అభిని టార్గెట్ చేయడం సరికాదని.. గేట్లు ఓపెన్ చేయడం కాదు దమ్ముంటే బయటికి పంపండి అంటూ అభి ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అభిజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బిగ్ బాస్ టీంపై రెచ్చిపోతుండటంతో గేమ్ ఎలా మలుపు తిరుగుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్