కేంద్రం వ్యవసాయ సంస్కరణ పేరిట తీసుకొచ్చిన మూడు కొత్తచట్టాలను రద్దు చేయాలని రైతులు కొద్దిరోజులుగా ఢిల్లీలో నిరసన చేపడుతున్నారు. 12రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తుండటంతో కేంద్రం రైతులతో పలుమార్లు చర్చలు జరిపింది. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టబడుతుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంటూ వస్తోంది.
Also Read: వ్యవసాయ బిల్లులతో రైతులకు లాభామా.. నష్టమా?
ఓవైపు చర్చలు జరుపుతుండగానే రైతు సంఘాలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్.. టీఆర్ఎస్.. టీడీపీ.. వామపక్షాలు సహా పలు పార్టీలు భారత్ బంద్ కు సంఘీభావం ప్రకటించి నేటి బంద్ లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నాయి.
భారత్ బంద్ ఉదయం 11 నుంచి 3గంటల వరకు కొనసాగుతుందని రైతుల సంఘాల నాయకులు ముందే ప్రకటించారు. ఈనేపథ్యంలో ప్రజలు సైతం బంద్ లో స్వచ్చంధంగా పాల్గొన్నారు. వ్యాపార.. వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడగా బస్సులు.. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజకీయ పార్టీలు నాయకులు రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
Also Read: మోడీ పాలనకు బ్రేకులు వేస్తున్న రైతులు
మధ్యాహ్నం 3గంటల వరకు బంద్ ప్రశాంతంగా కొనసాగింది. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా బంద్ ప్రశాంతగానే ముగిసినట్లు సమాచారం. నేటి భారత్ బంద్ ప్రభావం కేంద్రాన్ని సైతం కదిలించింది. బుధవారం రైతులతో ఆరో విడుత చర్చలు జరుగాల్సి ఉండగా నేటి రాత్రి 7గంటలకు చర్చలకు రావాలని కేంద్రం నుంచి రైతులకు అనుహ్యంగా పిలుపు వచ్చింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రైతులు చర్చలకు రావాలని ఆహ్వానం పంపారు. కేంద్రంలో రెండో స్థానంలో ఉన్న అమిత్ షా నుంచి రైతుల సంఘాల నాయకులు పిలుపు రావడంతో చర్చలకు ఓ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. రాత్రి 7గంటలకు చర్చలు జరుగునున్న నేపథ్యంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్