అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన మూవీ నాంది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథ, కథనం అందరినీ మెప్పించింది. సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా మంచి కథతో రాణించింది.
నాంది సినిమాకు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ వచ్చేసిందని.. బయ్యర్లకు కాస్త కమీషన్ కూడా వచ్చేసినట్టు తెలిసింది.
నాంది సీరియస్ సబ్జెక్ట్ కావడంతో ఇప్పటిదాకా అమ్ముడుపోకుండా అన్ని రైట్స్ అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు సినిమాకు మంచి టాక్ తో నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది.
ఇప్పటికే రీమేక్ రైట్స్ ను నిర్మాత దిల్ రాజు రెండు కోట్లకు కొన్నట్టు టాలీవుడ్ టాక్. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ‘ఆహా’ ఓటీటీకి అమ్మారాని.. అవి కూడా రూ.2.50 కోట్లు వచ్చినట్టు సమాచారం.
దీంతో నిర్మాతకు కూడా సినిమా రిలీజ్ అయ్యాక లాభాలు వచ్చినట్టు అయ్యింది. అల్లరి నరేశ్ కు ఈ సినిమాతో పేరు డబ్బు రాగా.. దర్శకుడు విజయ్ కు వరుస ఆఫర్లు వచ్చాయి.
ఇలా కొత్తగా చేసిన ‘నాంది’ మూవీ టీం చివరకు లాభాలతో ముగిసింది. మొదట కంగారు పడ్డ సినిమా నరేశ్ కెరీర్ లో చాలా రోజుల తర్వాత హిట్ మూవీగా నిలిచింది.