https://oktelugu.com/

బండి ధీమా.. కేసీఆర్ ను అలా ఏడిపిస్తాడట!?

ఎవరికైనా ప్రత్యర్థిని కొట్టాలని ఉంటుంది. కానీ ఆ ప్రత్యర్థి చాలా బలవంతుడైతే కొట్టడం అసాధ్యం. అయితే కేంద్రంలో అండ చూసుకొని చెలరేగిపోతున్న తెలంగాణ బీజేపీ బండి సంజయ్ తాజాగా కేసీఆర్ ను ఏడిపించే డైలాగ్ ఒకటి కొట్టాడు. అదిప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాల ప్రచారం ముగింపు నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్ మెంట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2021 / 06:26 PM IST
    Follow us on

    ఎవరికైనా ప్రత్యర్థిని కొట్టాలని ఉంటుంది. కానీ ఆ ప్రత్యర్థి చాలా బలవంతుడైతే కొట్టడం అసాధ్యం. అయితే కేంద్రంలో అండ చూసుకొని చెలరేగిపోతున్న తెలంగాణ బీజేపీ బండి సంజయ్ తాజాగా కేసీఆర్ ను ఏడిపించే డైలాగ్ ఒకటి కొట్టాడు. అదిప్పుడు వైరల్ గా మారింది.

    తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాల ప్రచారం ముగింపు నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్ మెంట్ ఇచ్చారని విమర్శించారు. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పీఆర్సీ ఎలా ఇస్తుందో స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

    2023లో గోల్కొండ కోట మీద కాషాయ జెండాను ఎగురవేయడమే మా లక్ష్యం అని బండి సంజయ్ ప్రకటించారు. అలా జెండా ఎగరడం కేసీఆర్ చూడాలని వింత కోరికను బయటపెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే సీఎం ఫాంహౌస్ నుంచి బయటకు వస్తారని అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి పార్టీలో అగ్రస్థానం కల్పించారు. కళాకారులు, ఉద్యమాకారులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.

    ఇలా కేసీఆర్ ను టీజ్ చేసే పనిలో బండి పడ్డారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం.. దాన్ని కేసీఆర్ చూసి కుళ్లు కోవడం చూడాలని తనలోని వింత కోరికను బయటపెట్టాడు. మరి ఆ రోజులు వస్తాయా? రావా? అన్నది వేచిచూడాలి.