https://oktelugu.com/

పాదయాత్రలకు ధీటుగా ‘బండి’ యాత్ర..!

ప్రజల్లో ఉండే నాయకుడికే ఓటర్లు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. దీనిని గుర్తించిన కొందరు నాయకులు పాదయాత్ర ఫార్మూలాను తీసుకొచ్చారు. ఈ ఫార్మూలా తెలుగు రాష్ట్రాల్లో బలంగా పని చేస్తోంది. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు పాదయాత్ర ఫార్మూలాతోనే అధికారంలోకి వచ్చారు. Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు పరీక్షగా మారనుందా? సీఎం కేసీఆర్ పాదయాత్ర చేయకపోయినా.. బస్సు యాత్రల్లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 24, 2020 / 11:55 AM IST
    Follow us on

    ప్రజల్లో ఉండే నాయకుడికే ఓటర్లు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. దీనిని గుర్తించిన కొందరు నాయకులు పాదయాత్ర ఫార్మూలాను తీసుకొచ్చారు. ఈ ఫార్మూలా తెలుగు రాష్ట్రాల్లో బలంగా పని చేస్తోంది.

    గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు పాదయాత్ర ఫార్మూలాతోనే అధికారంలోకి వచ్చారు.

    Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు పరీక్షగా మారనుందా?

    సీఎం కేసీఆర్ పాదయాత్ర చేయకపోయినా.. బస్సు యాత్రల్లో పాల్గొన్నారు. పాదయాత్ర కంటే తొందరగా ప్రజలను చేరుకునే అవకాశం బస్సు యాత్రతో ఉంటుంది. దీంతో కొందరు నేతలు బస్సు యాత్రల వైపు మొగ్గుచూపుతున్నారు.

    త్వరలోనే జమిలి ఎన్నికల రాబోతుండటంతో కాంగ్రెస్ లో ఎవరికీ టీపీసీసీ ఛీప్ పదవీ దక్కినా పాదయాత్ర చేయడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ సైతం బస్సు యాత్రకు సిద్ధమవుతోంది.

    బస్సు యాత్రతో ఎన్నికల్లోగా రెండుసార్లయినా రాష్ట్రాన్ని చుట్టేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రణాళికలు రచిస్తున్నారు. వీలైతే పాదయాత్ర కూడా చేయాలని బండి సంజయ్ భావిస్తున్నట్లు సమాచారం.

    Also Read: కేంద్రం చేతిలో జగన్‌ కీలుబొమ్మ.. అందుకేనా..!

    కేసీఆర్ పై వరుస దండయాత్రలతో రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ అధిష్టానం నుంచి తెలంగాణ నేతలకు పూర్తి మద్దతు లభిస్తుండంతో శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

    నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికపై ఇప్పటికే బీజేపీ దృష్టిసారింది. జమిలి ఎన్నికలపై బీజేపీ నేతలకు స్పష్టమైన అవగాహన ఉండటంతో నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లురుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్