https://oktelugu.com/

వ్యవసాయ చట్టాలు లాభమా..? నష్టమా..? అమెరికాలోని వ్యవసాయ చట్టాలు ఏం చెబుతున్నాయి..?

భారతదేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతులు దాదాపు 50 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, మేలే జరుగుతుందని రాష్ట్రపతి కోవింద్ సైతం ఇటీవల రిపబ్లిక్ డే ప్రసంగంలో తెలిపారు. అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 11 విడుదలుగా చర్చలు జరిపి, ప్రత్యామ్యాయం మార్గాలు చూపినా రైతులు ఒప్పుకోవడం లేదు. వ్యవసాయ చట్టాల రద్దు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 31, 2021 1:11 pm
    Follow us on

    భారతదేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతులు దాదాపు 50 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, మేలే జరుగుతుందని రాష్ట్రపతి కోవింద్ సైతం ఇటీవల రిపబ్లిక్ డే ప్రసంగంలో తెలిపారు. అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 11 విడుదలుగా చర్చలు జరిపి, ప్రత్యామ్యాయం మార్గాలు చూపినా రైతులు ఒప్పుకోవడం లేదు. వ్యవసాయ చట్టాల రద్దు తప్ప తమకు ఇంకేం అవసరం లేదని భీష్మించుకు కూర్చున్నారు.

    ఈ తరుణంలో కొందరు విశ్లేషకులు ఈ వ్యవసాయ చట్టాలపై చర్చిస్తున్నారు. ఈ చట్టాలను ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు అమలు చేశాయి. మరి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా అక్కడి వ్యవసాయ చట్టాలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాయా..? అక్కడి రైతులు ఏమంటున్నారు..?

    అమెరికా పైకి పాశ్చాత్య దేశంగా కనిపిస్తున్నా అక్కడా వ్యవసాయం మీద ఆధారపడిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ దేశంలో వ్యసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో నిర్వహిస్తారు. కొన్ని ప్రైవేట్ వ్యవస్థలు వ్యవసాయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని రైతులకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల మాదిరిగానే అమెరికాలో వ్యవసాయం జరుగుతోంది. అయితే ఇక్కడ రెండు పద్ధతుల్లో ఫామింగ్ చేస్తారు. ఒకటి మార్కెటింగ్ ఫామింగ్, రెండోది ప్రొడక్షన్ ఫామింగ్..

    మార్కెటింగ్ ఫామింగ్ లో రైతులు తమ ఉత్పత్తులకు వారికి నచ్చిన ధరలకు అమ్ముకోవచ్చు.. కానీ ప్రొడక్షన్ ఫామింగ్ లో మాత్రం కాంట్రాక్టర్లే రైతుల భూమిని ఆధీనంలోకి తీసుకొని వారికి కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఇదే పద్ధతిలో వర్జీనియాకు చెందిన మైక్ వీవర్ అనే రైతు తన పౌల్ట్రీఫాం నుంచి 19 ఏళ్ల పాటు ఓ సంస్థతో ప్రొడక్షన్ కాంట్రాక్టు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘15 లక్షల డాలర్లతో కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నాను. అయితే దీని నుంచి వచ్చే లాభం తక్కువ ’ అని వివరించాడు.

    ఇక కాంట్రాక్టు వ్యవసాయంతో మిశ్రమ ఫలితాలు ఉంటాయని భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ తల్హా రెహమాన్ అంటున్నారు. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియాలో పీహెచ్ డీ చేస్తున్నారు. రెహమాన్ ముత్తాత భారత్లో వ్యవసాయం చేశారు. ఆ తరువాత 1905లో అమెరికాకు వలస వచ్చారు. ‘కాంట్రాక్టు ఫార్మింగ్ తో రైతులకు పెద్దగా పని ఉండదు. పంటకు భద్రత ఉంటుంది. అయితే అంతిమంగా మాత్రం పంటకు ఎంత ధర వస్తుందో మాత్రం చెప్పలేము. ఆ ధర మన చేతుల్లో ఉండదు’ అని తెలిపారు.

    ఇదిలా ఉండగా కాంట్రాక్టు ఫార్మింగ్ తో అమెరికాలో ఆహారం, గ్రామీణ వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. నేషనల్ కాంట్రాక్టు పౌల్ట్రీ గ్రోయర్స్ అసోసియేషన్ అమెరికా వ్యవసయా విభాగం 2001లో చేసిన అధ్యయనం ప్రకారం 71 శాతం రైతులు దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారని తెలిపింది. ఇక అమెరికాలోనూ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని సీడీసీ తెలిపింది. ఇక్కడ వాతావరణ పరిస్థితుల కంటే అప్పలు ఒత్తిడి రైతులపై తీవ్రంగా ఉంటుందని మినెసోటాలోని మానసిక వైద్యుడు టెడ్ మాథ్యూ అన్నారు.

    కాంట్రాక్టు ఫామింగ్ తో ఎక్కవ మంది అమెరికన్లు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారు. వ్యవసాయం ఉత్పత్తులపై కాకుండా మాంసోత్పుత్తులపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ మాసం, పౌల్ట్రీ పరిశ్రమలది పెద్ద భాగంగా తయారైంది. 2018లో దేశంలో నిర్వహించిన సర్వే ప్రకారం ఐదు శాతం మంది మాత్రే శాకాహారులుగా ఉన్నట్లు తేలింది.