https://oktelugu.com/

పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ నుంచి మరో గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గిఫ్ట్ వచ్చింది. ఆయన నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ నుంచి ఒక దేశభక్తి, సమాజ సేవ ఉప్పొంగేలా తీర్చిదిద్దిన ఒక కత్తిలాంటి పాటను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. హిందీలో హిట్ అయిన ‘పింక్’రిమేక్ ను కేవలం కథను తీసుకొని చాలా మార్పులు చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పెట్టి తెలుగులో తీశారు. అల్ రెడీ రెడీ అయిన ఈ మూవీ మేలో రిలీజ్ కాబోతోంది. […]

Written By: , Updated On : March 3, 2021 / 09:24 PM IST
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గిఫ్ట్ వచ్చింది. ఆయన నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ నుంచి ఒక దేశభక్తి, సమాజ సేవ ఉప్పొంగేలా తీర్చిదిద్దిన ఒక కత్తిలాంటి పాటను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది.

హిందీలో హిట్ అయిన ‘పింక్’రిమేక్ ను కేవలం కథను తీసుకొని చాలా మార్పులు చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పెట్టి తెలుగులో తీశారు. అల్ రెడీ రెడీ అయిన ఈ మూవీ మేలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా మార్కెట్ కూడా ఇప్పటికే అయిపోయింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్, వందకోట్లు దాటిన మార్కెటింగ్ తో సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చేలా చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హీరోయిజాన్ని వెలికితీసేలా ‘వకీల్ సాబ్’ ఉండబోతోందని టాక్.

తాజాగా పవన్ ఫ్యాన్స్ నెత్తూరు పొంగేలా ‘సత్యమేవ జయతే’ అనే పాటను విడుదల చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటను ‘శంకర్ మహదేవన్’ పాడారు. ఈ పాటలో క్లిప్పింగ్ లు, పవన్ హవభావాలు, ఫైట్స్ ఫ్యాన్స్ కు గూస్ బాంబ్స్ తెప్పిస్తున్నాయి. వకీల్ సాబ్ ఈ సమ్మర్ కు కాక రేపడం ఖాయమన్నా అంచనాలు పెరిగిపోతున్నాయి.

వకీల్ సాబ్ సత్యమేవజయతి పాట ఇదే..

#VakeelSaab - Sathyameva Jayathe | Pawan Kalyan | Sriram Venu | Thaman S