
భారత మాజీ కెప్టెన్ , చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్ లో అత్యుత్తమ క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి దిగ్గజ క్రికెటర్ ఎడా పెడా ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటారు. ఆయన బ్యాటింగ్ కు ఎందరో బాధితులుగా మారారు.
ఇటీవల చెన్నైకి చేరుకున్న ధోని.. ఈసారి ఎలాగైనా సరే చెన్నైని పోటీలో నిలబడాలంటే చాలా కష్టపడుతున్నాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఫోర్లు, సిక్సులతో హోరెత్తిస్తున్నాడు.
అయితే అంతటి ధోనిని మన తెలుగు యువకుడు క్లీన్ బోర్డు చేశాడు. ఐపీఎల్ ప్రాక్టీసులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున వేలంలో కొన్న కడప యువ క్రికెటర్ హరిశంకర్ రెడ్డి సత్తా చాటుతున్నాడు.
బుధవారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో జట్టులోకి కొత్తగా వచ్చినయువ ఆంధ్రా ఫాస్ట్ బౌలర్ హరిశంకర్ రెడ్డి అద్భుతమైన రీతిలో బంతి విసరడంతో ఎంఎస్ ధోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ 22 ఏళ్ల కుర్రాడు 2018 నుంచి ఆంధ్రా జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు చెన్నై తరుఫున తన బౌలింగ్ తో సత్తా చాటుతున్నాడు.
తాజాగా చెన్నై జట్టు హరిశంకర్ ఏకంగా ధోనిని ఔట్ చేసిన వీడియోను షేర్ చేసింది. కడపలో డిగ్రీ చేసిన హరిశంకర్ ను ఇటీవలే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.20లక్షల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది.
Hari Shankar Reddy taking Dhoni's wicket during the practice#IPL2021 pic.twitter.com/zpEv8gHsp8
— Vinesh Prabhu (@vlp1994) March 17, 2021