రేపే నాలుగోవిడత.. గుంటూరులో ఏరులై పారుతున్న మద్యం, డబ్బు

ఏపీలో నాలుగోవిడత పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో రేపే పోలింగ్ కావడం.. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. ముఖ్యంగా గుంటూరు డివిజన్ లో మద్యం, డబ్బు, ఏరులై పారుతోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.రాజకీయంగా బాగా పరపతి ఉన్న ప్రాంతం కావడంతో టీడీపీ, […]

Written By: NARESH, Updated On : February 20, 2021 8:09 pm
Follow us on

ఏపీలో నాలుగోవిడత పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

పంచాయతీ ఎన్నికల్లో రేపే పోలింగ్ కావడం.. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. ముఖ్యంగా గుంటూరు డివిజన్ లో మద్యం, డబ్బు, ఏరులై పారుతోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.రాజకీయంగా బాగా పరపతి ఉన్న ప్రాంతం కావడంతో టీడీపీ, వైసీపీ ఇక్కడ లక్షలు కుమ్మరిస్తున్నాయి. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, బీరు , బిర్యానీ, గిఫ్ట్ లు, నగదు పంపిణీ చేస్తూ గ్రామాల్లో గెలుపు కోసం ఈ రాత్రంతా లాబీయింగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ 4వ విడతలో అన్ని సమస్యాత్మాక పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది తెలిపారు. రేపు ఉదయం నుంచి ఈ ఎన్నికలు జరుగనున్నాయి.6047 సమస్యాత్మాక, 4967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామన్నారు. నాలుగోదశ పంచాయతీ ఎన్నికల కోసం 28995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ద్వివేది తెలిపారు.

చివరి విడతలో భారీగా ప్రలోభాలకు అభ్యర్థులు తెరలేపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పంచాయతీ పీఠాలు పోకుండా రాజధాని అమరావతి ప్రాంతంలో ఇరు పార్టీలు కాపుకాస్తున్నాయి. బలంగా ఉన్న టీడీపీ, వైసీపీలు ఈ ప్రాంతం, గ్రామాలపై పట్టు కోసం భారీగా ఖర్చు చేయిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.