
యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. దసరా కానుకగా ఈ చిత్రం టీజర్ ను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ టీజర్ లో అఖిల్ ఇస్మార్ట్ గా కనిపిస్తుండగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే అదరగొట్టింది. ఇప్పటికే మూడు ఫ్లాపులు తెచ్చుకున్న అఖిల్ ఈ చిత్రంపైనే ఆశలు పెంచుకున్నాడు. అందమైన ప్రేమ జంట.. బ్యాచ్ లర్ ప్రేమతో పెళ్లికి ఎలా ఇబ్బందులు పడుతున్నాడో అకిల్ ఇందులో చూపించాడు.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అర్జున సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడు. అప్పట్లో హిట్ ఇచ్చి ఆరేంజ్ తో ఫ్లాప్ ఇచ్చిన భాస్కర్ మరి అఖిల్ కు హిట్ ఇస్తాడా లేదా అన్నది వేచిచూడాలి. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.