
దేశీయ ప్రభుత్వ రంగ బీమా కంపెనీలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తున్న సంగతి విదితమే. ఎల్‌ఐసీ ఆఫర్ చేస్తున్న పాలసీలలో టర్మ్ పాలసీ, ఎండోమెంట్ పాలసీ ప్లాన్స్, రిటైర్మెంట్ పాలసీ, మనీ బ్యాక్, చిల్డ్రన్స్ పాలసీ, ఇతర పాలసీలు ఉన్నాయి. ఎల్‌ఐసీ ఆఫర్ చేస్తున్న పాలసీలలో ఆధార్ స్తంభ్ పాలసీ కూడా ఒకటి.
8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. లో ప్రీమియం ప్లాన్ తో కూడిన ఆధార్ స్తంభ్ పాలసీని తీసుకుంటే తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ లాభాలను పొందవచ్చు. పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల తరువాత ఈ పాలసీలో లాయల్టీ బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది. కనీసం 75,000 రూపాయల నుంచి గరిష్టంగా 3,00,000 రూపాయల వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు.
ఈ పాలసీని తీసుకోవడం ద్వారా డెత్ బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి తొలి ఐదు సంవత్సరాలలో మరణిస్తే నామినీ పాలసీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు ఐదు సంవత్సరాల తర్వాత మరణిస్తే నామినీకి బీమా మొత్తంతో పాటు లాయల్టీ అడిషన్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. 8 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లు పాలసీ తీసుకుందామని భావిస్తే పాలసీ టర్మ్ 20 సంవత్సరాలుగా ఉంటుంది.
పాలసీ గడువులో ప్రీమియం రూపంలో దాదాపు 2 లక్షల రూపాయలు చెల్లిస్తే మూడు లక్షల రూపాయల బీమా మొత్తం మనకు అందుతుంది. లాయల్టీ అడిషన్ 97,500 రూపాయలతో కలిపి మొత్తం 4 లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. నెలకు 901 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఈ పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు.