Dancer kewal tamang Died : ప్రఖ్యాత డ్యాన్స్ షో ‘ఢీ’ (Dhee Dance Show)లో విషాదం అలుముకుంది. ఈ షోలో కంటిస్టెంట్ గా తనదైన స్టెప్పులతో అలరించిన స్టార్ డ్యాన్సర్ కేవల్ తమంగ్ ప్రాణాలు కోల్పోయాడు. డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్ టీమ్ లో కంటిస్టెంట్ గా ఉన్న కేవల్ తమంగ్.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే.. ఈ యువ డ్యాన్సర్ ను బ్లడ్ క్యాన్సర్ వెంటాడింది.
చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాదపడుతున్న కేవల్ తమంగ్.. చికిత్స పొందుతున్నాడు. అతడిని ఆదుకోవాలని యశ్వంత్ మాస్టర్ సోషల్ మీడియాలో అందరినీ వేడుకున్నాడు. ఈ పోస్టు ప్రతి ఒక్కరినీ కదిలించింది. ‘‘నా అసిస్టెంట్ కేవల్ మీ అందరికీ తెలుసు. అతనికి ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. కేవల్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అందరూ ఆదుకోండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు మాస్టర్ యశ్వంత్.
అదేవిధంగా.. జడ్జిగా ఉన్న హీరోయిన్ ప్రియమణి కూడా కేవల్ ను ఆదుకోవాలని అందరినీ కోరింది. డీ కంటిస్టెంట్స్ లో ఒకరైన కేవల్ తమంగ్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, ఈ యువ డ్యాన్సర్ ను ఆదుకోవాలని పోస్టు చేసింది ప్రియమణి. అయితే.. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. మృత్యు కోరల్లోంచి కేవల్ తమంగ్ ను కాపాడలేకపోయారు. ఆరోగ్యం విషమించి సెప్టెంబర్ 19వ తేదీన కేవల్ తుదిశ్వాస విడిచాడు.
ఈ విషయాన్ని డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్ వెల్లడించారు. ‘‘నా సోదరుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మమ్మల్ని అందరినీ ఒంటిరి చేసి ఎంతో త్వరగా వెళ్లిపోయావ్ తమంగ్’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు యశ్వంత్ మాస్టర్. ఈ పోస్టును వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవల్ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.