https://oktelugu.com/

ఆచార్య: అప్ డేట్ ఇచ్చిన చిరంజీవి-కొరటాల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు చిరంజీవి-కొరటాల శివ గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఆచార్య’ మూవీ నుంచి అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే చాలా రోజులుగా ఈ సినిమా నుంచి ఒక్క చిన్న అప్ డేట్ కూడా లేకుండా నిరాశగా ఉన్న అభిమానులకు ఊరటనిచ్చేలా ప్రకటన చేశారు. చిరంజీవి మూవీలోకి ఇటీవలే రాంచరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనపై కూడా షూటింగ్ జరుగుతోంది. మేలో విడుదలకు రెడీ అవుతోంది. న్యూ ఇయర్, సంక్రాంతికి ఏదైనా అప్డేట్ టీజర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 27, 2021 / 10:53 AM IST
    Follow us on

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు చిరంజీవి-కొరటాల శివ గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఆచార్య’ మూవీ నుంచి అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే చాలా రోజులుగా ఈ సినిమా నుంచి ఒక్క చిన్న అప్ డేట్ కూడా లేకుండా నిరాశగా ఉన్న అభిమానులకు ఊరటనిచ్చేలా ప్రకటన చేశారు.

    చిరంజీవి మూవీలోకి ఇటీవలే రాంచరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనపై కూడా షూటింగ్ జరుగుతోంది. మేలో విడుదలకు రెడీ అవుతోంది. న్యూ ఇయర్, సంక్రాంతికి ఏదైనా అప్డేట్ టీజర్ ఉంటుందని ఆశించిన మెగా అభిమానులకు అది లేకుండా పోయింది.

    నిన్న చిరంజీవి సైతం కొరటాల అప్డేట్ ఇవ్వకుంటే తానే లీక్ చేస్తానని మీమ్స్ విడుదల చేశాడు. దీంతో దర్శకుడు కొరటాల ఎట్టకేలకు ఈరోజు క్లారిటీ ఇచ్చాడు. 29న సాయంత్రం 4.05 గంటలకు  టీజర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చిన్న వీడియో కట్ తో ప్రకటించారు.

    ఆచార్య మూవీకి థీమ్ సాంగ్ లా కనిపిస్తున్న దీనికి మణిశర్మ సంగీతం గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది. దేవాలయ భూములు అన్యాక్రాంతం కావడం.. నక్సలైట్ ఎదురుతిరగడం అనే కథాంశం ఆధారంగా ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతోంది.

    ప్రస్తుతం ఆచార్య మూవీ తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లి అడువుల్లో సాగుతోంది. తాజాగా 29న టీజర్ విడుదలవుతోంది.