Chewing gum: చూయింగ్ గమ్ తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే షాక్ అవుతారు

క్రీడాకారులు, ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు చూయింగ్ గమ్‌ను తింటుంటారు. అయితే ఈ చూయింగ్ గమ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 29, 2024 8:49 pm

Chewing gum

Follow us on

Chewing gum: సాధారణంగా చాలా మంది టైమ్‌పాస్‌కి చూయింగ్ గమ్ తింటుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, యువకులు అయితే ఎక్కువగా చూయింగ్ గమ్ నములుతుంటారు. అయితే చాలామంది దీనిని కేవలం సరదాకి మాత్రమే నములుతుంటారని అనుకుంటారు. కానీ ఇలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చూయింగ్ గమ్ వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తినడానికి తీపిగా ఉండే ఆ తర్వాత సాధారణం అయిపోయే చూయింగ్ గమ్‌ను ఎక్కువగా తింటారు. నోరు దుర్వాసన వస్తుంటే తగ్గడానికి, పురుషులు అయితే మద్యం సేవించిన తర్వాత వాసన బయటకు తెలియకూడదని చూయింగ్ గమ్ నములుతారు. అలాగే క్రీడాకారులు, ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు చూయింగ్ గమ్‌ను తింటుంటారు. అయితే ఈ చూయింగ్ గమ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

 

చూయింగ్‌ గమ్ నమలడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని నమలడం వల్ల నోటిలోని దుర్వాసన అంతా పోతుంది. అలాగే దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చూయింగ్ గమ్ నమలడం వల్ల లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో నోటిలో బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అలాగే నోటిలో ఉండే కుహరం, ఫలకం వంటివి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే షుగర్ ఉండే చూయింగ్ గమ్‌ల కంటే షుగర్ లేని చూయింగ్ గమ్‌లను వాడటం ఆరోగ్యానికి మంచిది. ఆర్టిఫిషియల్ షుగర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌లను నమలడం మంచిది. చూయింగ్ గమ్ తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మెదడు చురుకుదనం కూడా పెరుగుతుంది. దీంతో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. కొందరు ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి వారికి చూయింగ్ గమ్ బాగా ఉపయోగపడుతుంది.

 

చూయింగ్ గమ్ నమలడం వల్ల బరువు తగ్గుతారు. దీన్ని నమలడం వల్ల చాలా రిఫ్రెష్‌గా ఉంటారు. ఇది జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సాయపడుతుంది. అయితే క్రికెటర్లు, క్రీడాకారులు ఎక్కువగా చూయింగ్ గమ్ నములుతుంటారు. ఇలా నమలడం వల్ల అలసట పోయి రిఫ్రెష్ అవుతారట. అలాగే జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందట. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎక్కువగా నమలడం అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఎక్కువగా చూయింగ్ గమ్‌ను నమలవద్దు. విపరీతంగా నమిలితే దవడ నొప్పి వస్తుంది. అలాగే కండరాలపై ఒత్తిడి పడుతుంది. అయితే కొందరు తెలియక చూయింగ్ గమ్‌ను మింగేస్తారు. ఇలా మింగితే జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి అతిగా తినవద్దు. ముఖ్యంగా పిల్లలకు అయితే అసలు ఇవ్వవద్దు. నమిలేటప్పుడు పొరపాటున మింగేస్తే ప్రమాదం. కాబట్టి పిల్లలకు కిలోమీటరు దూరంగా వీటిని ఉంచండి. ఇందులోని షుగర్ కూడా పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే వీటిని రసాయనాలతో కలిపి తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు పక్కన పెడితే నష్టాలు కూడా ఉన్నాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. కాబట్టి చూయింగ్ గమ్‌ను పిల్లలకు అసలు ఇవ్వవద్దు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.