https://oktelugu.com/

Hair : ఇంట్లో దొరికే వాటితో కురులను దృఢంగా మార్చుకోండిలా!

వారానికి రెండు నుంచి మూడుసార్లు ఇలా చేస్తే జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే తెల్ల జుట్టు సమస్య తగ్గడంతో పాటు కురులు బలంగా పెరుగుతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 12, 2024 / 05:12 AM IST

    Hair

    Follow us on

    Hair  : అమ్మాయి అందంగా కనిపించాలంటే జుట్టు ముఖ్యం. ఈమధ్య కాలంలో చాలామంది కురులు చాలా పలుచగా అయిపోతున్నాయి. కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. దీనికోసం అమ్మాయిలు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. రసాయనాలు ఉండే వీటిని వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. వీటికి బదులు ఇంట్లో ఉండే పదార్థాలతో కురులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి పదార్థాలేంటో? వాటిని ఎలా వాడితే జుట్టు బలంగా పెరుగుతుందో చూద్దాం.

    కురులు దృఢం కావాలంటే రోజూ ఉదయం లేదా సాయంత్రం రెండు పుదీనా ఆకులను నమిలితే జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే రోజుకొకసారి లావెండర్ టీ తాగితే కురులు అందంగా తయారవడంతో పాటు దృఢంగా ఉంటాయి. సాధారణంగా చాలామంది కేవలం కొబ్బరినూనె మాత్రమే తలకు అప్లై చేస్తుంటారు. ఇందులో మెంతులు, కరివేపాకు, మందార ఆకు వేసి జుట్టుకు రాయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు జుట్టు కుదుళ్లను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్కిలేషన్ జరిగి జట్టు తొందరగా పెరుగుతుంది.

    వారానికి రెండుసార్లు అయిన తలకు హెయిర్ ప్యాక్ అప్లై చేయాలి. దీన్నిమ సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. మందార ఆకులు, పువ్వులు, మెంతులు, ఉల్లిపాయ, కరివేపాకును కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి రెండు గంటల పాటు వదిలేయాలి. బాగా ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోవడం తగ్గడంతోపాటు బలంగా పెరుగుతుంది.

    కర్పూరం నూనె ఎలా చేసుకోవాలంటే?
    కురులకు రోజూ కర్పూరం నూనె అప్లై చేసినట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ నూనెను తయారు చేసుకోవాలంటే ముందుగా కర్పురాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని కొబ్బరి నూనెలో వేసి 5నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నూనెను చల్లార్చి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని రోజూ రాత్రి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వారానికి రెండు నుంచి మూడుసార్లు ఇలా చేస్తే జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే తెల్ల జుట్టు సమస్య తగ్గడంతో పాటు కురులు బలంగా పెరుగుతాయి.