Digital Payments: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమేంట్ కు అలవాడుపడిపోయారు. ఫోన్ పే, గూగుల్ లపే, పేటీయం ఇలా రకరకాల యాప్స్ ద్వారా మనీని ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. కొన్ని బ్యాంకులు ప్రత్యేకంగా యాప్ లను రూపొందించి వాటి ద్వారా మనీని సెండ్ చేసుకునేవిధంగా అవకాశాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది జేబులో డబ్బులు పెట్టుకోవడం లేదు.అయితే ఒక్కోసారి పేమేంట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. నెట్ వర్క్ లేకనో.. లేదా బ్యాలెన్స్ కంప్లీట్ అవడం వల్ల నెట్ లేకపోతే పేమేంట్ చేయడం కుదరదు. కానీ ఈ చిన్న ట్రిక్ ద్వారా ఇంటర్నెట్ లేకుండా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
చేతిలో మొబైల్ ఉంటే బ్యాంకు మనదగ్గర ఉన్నట్లే. ఒకప్పుడు డబ్బుులు ఒకరి నుంచి మరొకరికి పంపించాలంటే పెద్ద ప్రయాస ఉండేది. అంతేకాకుండా షాపింగ్ చేసేటప్పుడు చేతి ద్వారా డబ్బులు ఇచ్చి వస్తువులను కొనుగోలు చేసేవాళ్లు. కానీ డిజిటల్ పేమేంట్స్ వచ్చిన తరువాత కూరగాయలు అమ్మేవాళ్లు సైతం క్యూఆర్ కోడ్ నుఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో మొబైల్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ జరగడానికి ఇంటర్నెట్ కచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు దాని అవసరం లేకుండా డబ్బులు పంపించుకోవచ్చు.
ఇందుకోసం ముందుగా 080 4516 36666, 6366 200 200, 080 4516 3518 అనే నెంబర్లకు బ్యాంకుతో లింక్ ఉన్న నెంబర్ తో డయల్ చేయాలి. ఇలా చేయగానే కస్టమర్ కేర్ కాల్ కు వెళ్తుంది. ఆన్లైన్లో అడిగిన నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఆఫ్ లైన్ యూపీఐ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ తరువాత ఎవరికైతే డబ్బులు చెల్లించాలో వారి యూపీఐ నెంబర్ ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎంత మొత్తం చెల్లిస్తున్నారో దానిని ఎంటర్ చేయాలి.చివరగా రెగ్యులర్ గా ఎంట్రీ చేసే యూపీఐ పిన్ ను ఎంట్రీ చేయాలి.
ఇప్పుడు ఎవరికైతే చెల్లిస్తున్నారో.. వారికి మీరు అనుకున్న మొత్తం వెళ్తుంది. ఎన్నోసార్లు ఇంటర్నెట్ అందుబాటులో ఉండకపోచ్చు. లేదా సమయానికి బ్యాలెన్స్ పూర్తి కావొచ్చు. అందువల్ల ఈ ప్రక్రియను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా ఎప్పటికైనా ఉపయోగపడొచ్చు.