Yoga For Periods: ఆడవాళ్లకు పీరియడ్స్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ గా పీరియడ్స్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొందరికి ఆరోగ్య సమస్యల కారణంగా సక్రమంగా జరగదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురవుతారు. నెలనెలు రుతుక్రమం సరిగా ఉంటేనే ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. వీటిలో క్రమం తప్పితే ఏదో సమస్య ఉన్నట్లు లెక్క. ఈ క్రమంలో ప్రెగ్నేన్సీ సమయంలో మినహా మిగతా సమయంలో పీరియడ్స్ సక్రమంగా లేకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే వైద్యుల సలహాతో కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లోనే చేసే ఈ ఆసనాలు గురించి తెలుసుకుందాం..
యోగాసనాల ద్వారా కొన్ని పెద్ద పెద్ద రోగాలు నయమవుతున్నాయి. దీంతో పీరియడ్స్ సక్రమంగా సాగడానికి కూడా యెగాసనాలు ఉపయోగపడుతాయి. అయితే శరీరంపై పెద్దగా ప్రభావం కలగకుండా ఉండే ఆసనాలుమాత్రమే వేయాలి. వీటిలో మొదటిది భుజంగాసనం. నేలపై పడుకున్న తరువాత పొట్టను ఆనించాలి. ఆ తరువాత నడుం నుంచి శరీర భాగాన్ని పైకి లేపాలి. ఆ తరుతవాత ఊపిరి పీల్చుకోవాలి. దీని వల్ల నాభి నేలకు టచ్ అవుతుంది. అలాగే మోచేతులని నిటారుగా ఉంచి భఉజాలు, తలని వీలైనంత వెనక్కి ఉంచాలి. ఇలా 10 సెకన్ల పటు చేసి రెస్ట్ తీసుకోవాలి.
ఈ ఆసనాల్లో రెండోది ఉష్ట్రాసనం. నేలపై కాళ్లను వెడల్పుగా పెట్టిన తరువాత చేతులను పైకి లేపి మెల్లగా వెనక్కి వంగుతూ పాదలను అందుకోవాలి. తల పైకి చూసేలా ఉంచాలి. కానీ తలను అటూ, ఇటూ తిప్పొద్దు. నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. మూడో ది మలాసనం. స్క్వాట్ పొజిషన్ లో నేలపై కూర్చోవాలి. రెండు మోచేలని రెండు మోకాళ్లపై నొక్కి, వెన్నెముకని స్ట్రెయిట్ గా పెట్టాలి. ఇప్పుడు చేతులను కలపాలి. మెడ, భుజాలు రిలాక్స్ చేసి శ్వాస తీసుకోవాలి.
ఇక చివరిది ధనురాసనం. నేలపై పొట్టను ఆనించి మోకాళ్లను, నడుం పైగాన్ని పైకి లేపి వెనక నుంచి మోకాళ్లను పట్టుకోవాలి. ఇలా పట్టుకొని కొన్ని సెకన్ల పాటు శ్వాసను తీసుకోవాలి. ఆ తరువాత యథాస్థానానికి రావాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండి పీరియడ్స్ టైంటూ టైం అవుతాయని కొందరు యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ యోగాసనాలు వేసే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.