Women In Room: 2024 సంవత్సరం వేసవి కాలం వెరీ హాట్ గా ఉండనుంది. మార్చి పూర్తి కాకముందే 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూగర్భజలాలు సైతం అడుగంటిటపోవడంతో నీటి కొరత ఏర్పడనుంది. మరో మూడు నెలల పాటు ఇలాగే ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే నీటిని పొదుపు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలకు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు కూల్ గా ఉండేందుకు ప్రయత్నించాలని తెలిపింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఇందులో ఏముందంటే?
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు చేసింది. వైద్య, ఆరోగ్య కుటుంబ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణణ్ సలహాలు, సూచనతో ఓ ప్రకటనను జారీ చేశారు. వాతావరణంలో 40.5 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే ఎంతటి ఆరోగ్యకర శరీరమైనా ప్రభావం చూపుతుందన్నారు. ఇలాంటి సమయంలో తీవ్రమైన చెమట రావడం,అధికంగా దాహం వేయడం, తల తిప్పడం, కండరాలు పట్టేడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.
అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, టోపీ, స్క్రాప్ ధరించి వెళ్లాలి. వృద్ధులు, పిల్లలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. బయటకు వెళ్లిన సమయంలో వాహనాలు పార్కింగ్ చేసినప్పుడు అందుల్లో పిల్లలు, పెంపుడు కుక్కలను వదిలి వెళ్లొద్దు. ఎండలో చెప్పులు లేకుండా నడవకూడదు.
మధ్యాహ్న సమయంలో దాదాపు వంట గదికి వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఎండవేడికి ఇక్కడ ఉష్ణోగ్రత మరింత పెరిగి అక్కడున్న వారు డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. వంటగదిలో ఉక్కపోత ఎక్కువగా వస్తుంది కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇదే సమయంలో ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మద్యం, టీ, కాఫీలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరంగా కూల్ డ్రింక్స్ ను తీసుకోవద్దు. ఇంట్లో చేసిన చల్లటి పానీయాలు మాత్రమే తీసుకోవాలి.