https://oktelugu.com/

Women Health: యోని వాసన వస్తుందా? మరి దీనికి చెక్ పెట్టడం ఎలా?

మహిళలు యోని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు యోని నుంచి దుర్వాసన వస్తుంది. దీని వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే కొందరు యోని విషయంలో అసలు జాగ్రత్త వహించరు. దీనివల్ల యోనిలో దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2024 / 02:31 AM IST

    Womens health

    Follow us on

    Women Health: మహిళలు యోని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు యోని నుంచి దుర్వాసన వస్తుంది. దీని వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే కొందరు యోని విషయంలో అసలు జాగ్రత్త వహించరు. దీనివల్ల యోనిలో దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మిగతా శరీర భాగాలను ఎలా శుభ్రంగా చూసుకుంటారో యోనిని కూడా అలానే చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. యోని విషయంలో అసలు పరిశుభ్రత పాటించకపోవడం వల్లే యోనిలో దుర్వాసన వస్తుంది. శుభ్రత పాటించనప్పుడు కొన్నిసార్లు యోని ఇన్ఫెక్షన్‌కి గురై బ్యాక్టీరియల్ వాగినోసిస్ అనే దానికి గురవుతుంది. దీని వల్ల యోని నుంచి దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు కాండిడా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

    యోని వాసన రాకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కలయికలో పాల్గొన్న తర్వాత యోనిని శుభ్రం చేసుకోవాలి. అలాగే బాత్‌రూమ్ వెళ్లిన ప్రతిసారి మహిళలు యోనిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. యోని ఎప్పుడు తేమగా ఉండేలా కాకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడు తేమ ఉండటం వల్ల బ్యాక్టీరియా ఉండిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడూ యోనిని క్లీన్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల సమస్య తగ్గుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే లైట్ తీసుకోకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కొందరు పూర్తిగా వాటర్ తాగరు. బాడీ హైడ్రేట్‌గా ఉంటే యోని విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బాడీ హైడ్రేట్‌గా ఉండాలంటే తప్పకుండా వాటర్ తాగాలి. అలాగే ఆహార విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు ఉండే ఆహారంతో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

     

    వాష్‌రూమ్ వెళ్లిన ప్రతిసారి కూడా యోని విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఎప్పటికప్పుడూ యోనిని శుభ్రం చేసుకోవాలి. అలాగే పీరియడ్స్ సమయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు పీరియడ్స్ సమయంలో ఎక్కువ సమయం ప్యాడ్ పెట్టి ఉంచేస్తారు. దీనివల్ల యోనిలో ఇన్ఫెక్షన్ అయి దురద, వాసన వంటివి వస్తాయి. కాబట్టి తప్పకుండా చాలా జాగ్రత్త వహించాలి. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, వాష్ రూమ్ వెళ్లిన ప్రతీసారి కూడా యోని విషయంలో జాగ్రత్తలు వహించాలి. అయితే కొందరు యోని విషయంలో అసలు జాగ్రత్తగా ఉండరు. దీనివల్ల కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మూత్ర విసర్జన చేసిన తర్వాత కొందరు అసలు యోనిని శుభ్రం చేసుకోరు. దీనివల్ల యోనిలో బ్యాక్టీరియా ఉండిపోయి.. దుర్వాసనకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మూత్ర విసర్జన తర్వాత కూడా యోనిని శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి యోని విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించండి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.