Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తెలివైన రాజకీయవేత్త.. మేధావి, ఆర్థికవేత్త. ఆయన చెప్పిన నైతిక పాఠాలు నేటికీ మన జీవితాలకు వర్తిస్తున్నాయి. చాణక్యుడు చెప్పిన సూత్రాలను నేటికీ పాటించేవారు ఉన్నారు. చాణక్య నీతిని పాటించేవారు జీవితంలో విజయం సాధిస్తున్నారు. ఇక చాణక్యుడు పురుషులకు ఆధిపత్యం ఇచ్చినా.. కొన్ని విషయాల్లో పురుషులకన్నా స్త్రీలే ముందు ఉంటారని చెబుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం వారికి స్వేచ్ఛ లేదు. చాణక్యుడి ప్రకారం నాలుగు విషయాల్లో పురుషులకన్నా స్త్రీలే ముందు ఉంటారట. అవేంటో చూద్దాం.
తెలివైన వారు స్త్రీలే..
చాణక్యుడి ప్రకారం.. స్త్రీలు పురుషులకన్నా తెలివైనవారు. మహిళల ఈ జ్ఞానం కష్టసమయాల్లో ఉపయోగపడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మహిళలు వాటిని సులభంగా పరిష్కరిస్తారు. కష్టసమయాల్లో ఎలా స్పందించాలి.. ఎలా బయటపడాలి అనే విషయం పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువగా తెలుసని చాణకుడ్యు చెప్పాడు.
ధైర్యవంతులు..
ఇక స్త్రీలు పురుషులకన్నా ధైర్యవంతులని కూడా చాణక్యుడు తెలిపాడు. సాధారణంగా స్త్రీలకన్నా పురుషులే ధైర్యవంతులని చాలా మంది భావిస్తారు. చాణక్యుడి ప్రకారం.. పురుషులకన్నా స్త్రీలే చాలా విషయాల్లో ధైర్యంగా ఉంటారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. ధైర్యం మాత్రం పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. వంద మంది పురుషులు ఉన్న చోట కూడా స్త్రీ ధైర్యంగా ఉంటుంది. కానీ వందమంది స్త్రీలుఉన్నచోట పురుషుడు ధైర్యంగా ఉండలేడు.
ఎక్కువ ఆకలి..
చాణక్యుడి ప్రకారం.. స్త్రీలు పురుషులకన్నా ఎక్కువగా ఆకలితో ఉంటారు. ఎక్కువగా తింటారు కూడా. కారణం శరీర నిర్మాణమే. పురుషులతో పోలిస్తే మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వారికి పెద్దమొత్తంలో కేలరీలు అవసరమవుతాయి. అందుకే వారికి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. మహిళలు ఆరోగ్యంంగా ఉంటే కుటుంబం కూడా బాగుంటుంది.
సున్నితత్వం ఎక్కువ..
ఇక స్త్రీలు పురుషులకన్నా ఎక్కువ సున్నితంగా ఉంటారు. వారు ఏదైనా ఆలోచనను త్వరగా గ్రహిస్తారు. వారిబాధ కన్నీళ్ల రూపొంలో బయటకు వస్తుంది. స్త్రీల శరీరం కూడా చాల సున్నితంగా ఉంటుంది. చిన్న బాధను కూడా పెద్దగా భావిస్తారు. చాణక్యుడి ప్రకారం, స్త్రీలు పురుషుల కన్నా ఎనిమిది రెట్లు సున్నితంగా ఉంటారు. కానీ, వారు తీసుకునే నిర్ణయాలు మాత్రం గొప్పగా ఉంటాయి.