Womb:మహిళలకు వయసు పెరిగే కొద్దీ అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా పిల్లలు కలిగిన తరువాత గర్భసంచి సమస్యలు తీవ్రమవుతాయి. 35 నుంచి 40 ఏళ్లు వచ్చేసరికి పీరియడ్ సమయంలో ఎక్కువగా రక్త స్రావం రావడం, వైట్ డిశ్చార్జ్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇలాంటి సమయంలో కొందరు గర్భ సంచిని తీసేయాలని అనుకుంటారు. అయితే ఇలా చిన్న చిన్న కారణాలకు గర్భసంచిని తీసేయడం కరెక్టేనా? అనే విషయంపై కొందరు వైద్యులు ఇస్తున్న సలహా ఏంటంటే?
ఇటీవల చాలా మంది పీరియడ్ సమయంలో 5 నుంచి 10 రోజుల పాటు రక్త స్రావం అవుతుందనే సమస్యతో ఆసుపత్రికి వస్తున్నారు. అయితే దీనికి గర్భ సంచి మాత్రమే కారణం అనుకోవద్దని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఈసమస్య వచ్చినప్పుడు ముందుగా ఆల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవాలి. ఇందులో ఏమీ తెలియకపోతే థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఇది హెచ్చు తగ్గుల కారణంగా కూడానూ ఈ సమస్య వస్తుంది.
కొంత మందిలో అధిక రక్తస్రావం కావడానికి గర్భాశయం లోపల పెల్విక్ ఇన్ఫెక్షన్ కారణమూ అవుతుంది. అందువల్ల ముందుగా అవసరమైన పరీక్షలు చేయించుకొని పూర్తిగా నిర్దారణకు వచ్చిన తరువాతే గర్భసంచి తీసేసే విషయంపై ఆలోచించాలి. చాలా మందిలో 35 నుంచి 40 ఏళ్లలోపు వారికిఈ సమస్యలు ఎదురు కాగానే గర్భ సంచి తీసేయడమే మేలని భావిస్తారు. కానీ అలా చేయడం వల్ల అండాల పనితీరు తగ్గిపోతుంది. ఆ తరువాత మోనోపాజ్ త్వరగా వస్తుంది. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి.
అయితే రక్త స్రావంతో బాధపడేవారు. కరాపర్ టి చికిత్స మేలని వైద్యులుచెబుతున్నారు. దీనిని గర్భాశయంలో అమర్చడం వల్ల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ 100 శాతం అని చెప్పలేమని అంటున్నారు. అయితే కొందరికి రక్త స్రావం ద్వారానే కాకుండా కడుపు నొప్పి ద్వారా కూడా గర్భాశయసమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలకు హిస్టరెక్టమీ సర్జరీ మేలని కొందరు చెబుతున్నారు. అందువల్ల సమస్యను తెలుసుకోవడం దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.