https://oktelugu.com/

Wise men : జ్ఞానులు ఎందుకు మౌనంగా ఉంటారంటే.?

ఫలితంగా అతనితో మాట్లాడాలంటేనే ఎదుటివారు జంకేవారు. అలా భూ వివాదంలో పిలవకున్నా అక్కడికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య తల దూర్చాడు. తనది నరం లేని నాలుక కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడాడు. చివరికి ఆ భూవివాదం తాలూకూ వ్యక్తులు అతడిని చితకబాదారు. అందుకే నోరు అదుపు, మాట పొదుపు అని పెద్దలు ఊరకే అనలేదు. అందుచేత ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి, అన్నింటికీ మించి వ్యర్థ ప్రసంగం చేయకుండా ఉండాలి.. అదే జ్ఞానవంతుల లక్షణం.

Written By:
  • NARESH
  • , Updated On : March 7, 2024 / 09:40 PM IST
    Follow us on

    Wise men : “జ్ఞానే మౌనం:” రఘువంశ తిలకుడైన రాముడు పాటించిన సిద్ధాంతం. అలా పాటించాడు కాబట్టే రాముడు మర్యాద పురుషోత్తముడయ్యాడు. సకల గుణాభిరాముడిగా వినతికెక్కాడు. ఎందుకంటే జ్ఞానవంతుడైన రాముడు వివాదాల జోలికి పోలేదు. అనవసర ప్రసంగాలు చేయలేదు. ఎంతవరకు ముఖ్యమో అంతవరకే మాట్లాడాడు. తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినప్పటికీ తన జ్ఞానాన్ని ఇసుమంతైన తగ్గించుకోలేదు. పైగా నీతి మాటలు మాట్లాడాడు. ధర్మబద్ధంగా పయనం సాగించాడు. అందుకే జ్ఞాని మిత భాషి లాగా ఉండాలని పురాణాలు చెబుతుంటాయి.

    ఎవరైనా సరే ఏదైనా విషయం మీద చర్చ మొదలు పెట్టినప్పుడు జ్ఞానవంతుడు అందులో తల దూర్చడు. కేవలం విని ఊరుకుంటాడు. మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు రెండు లేదా మూడు కంటే ఎక్కువ మాటలు మాట్లాడడు.. ఎక్కువ మాట్లాడితే అధిక ప్రసంగి అంటారు. అప్పుడు అసలు విషయం పక్కదారి పట్టి అనవసర ముచ్చట్లు తెరపైకి వస్తాయి. ఫలితంగా పదిమందిలో చులకన కావాల్సి వస్తుంది. అదే విషయం వరకు మాట్లాడితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అధిక ప్రసంగం వల్ల కొన్ని కొన్ని సార్లు వివాదాలు కూడా ఏర్పడతాయి. అవి చినికి చినికి గాలి వాన లాగా మారుతాయి.

    మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడాలి. అలాంటి సమయంలో నిశ్శబ్దంగా ఉంటే కుదరదు. జ్ఞాని అనేవాడు తన వద్ద ఉన్న విషయ పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలి. లేదా అర్థవంతమైన చర్చకు ఉపకరించాలి. అంతేతప్ప అనవసరంగా మాట్లాడకూడదు. వెనకటికి ఒక ఊరిలో పంచాయతీ పెద్ద ఉండేవాడు. ఆయనకు అధిక ప్రసంగి అని పేరు ఉండేది. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో తల దూర్చేవాడు. తను మాట్లాడుకుంటూ వెళ్లేవాడు. ఎదుటివారికి అసలు అవకాశం ఇచ్చేవాడు కాదు. ఫలితంగా అతనితో మాట్లాడాలంటేనే ఎదుటివారు జంకేవారు. అలా భూ వివాదంలో పిలవకున్నా అక్కడికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య తల దూర్చాడు. తనది నరం లేని నాలుక కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడాడు. చివరికి ఆ భూవివాదం తాలూకూ వ్యక్తులు అతడిని చితకబాదారు. అందుకే నోరు అదుపు, మాట పొదుపు అని పెద్దలు ఊరకే అనలేదు. అందుచేత ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి, అన్నింటికీ మించి వ్యర్థ ప్రసంగం చేయకుండా ఉండాలి.. అదే జ్ఞానవంతుల లక్షణం.