Wipro AI360: విప్రో సంచలన నిర్ణయం.. ‘ఏఐ’ శిక్షణ.. ఉద్యోగులకు ఉద్వాసన?

ఏఐ వినియోగంపై విప్రో అధికారికంగా సంచలన ప్రకటన చేసింది. త్వరలో ఏఐ వినియోగంపై శిక్షణ ఇస్తున్నామని, ఇందు కోసం 2,50,000 మంది ఉద్యోగులకు ఫండమెంటల్స్, బాధ్యాతాయుత వినియోగం గురించి వివరిస్తామని తెలిపింది. ఆగస్టు 2023 నుంచి దీనిని ప్రారంభించి ఏడాది పాటు శిక్షణ ఇస్తామని తెలిపింది. దీంతో ఇండియన్ కంపెనీలు సైతం ఏఐకి అలవాటు పడడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఏఐ ప్రభావం విప్రో ఉద్యోగలుపై పడనుందా? అనే చర్చ సాగుతోంది.

Written By: Srinivas, Updated On : July 13, 2023 11:32 am

Wipro AI360

Follow us on

Wipro AI360: ప్రపంచాన్ని ఇప్పటి వరకు మనిషి శాషించాడు. కానీ ఇప్పటి నుంచి కంప్యూటర్ శాసించేలా తయారవుతోంది. ప్రతీ పనిలో టెక్నాలజీ ఎంట్రీ ఇస్తూ మనిషి అవసరం లేకుండా చేస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో Atrifisial Intelligence (AI) విస్తరించడంతో రాను రాను మనుషుల అవసరం లేకుండా పోయేలా ఉంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఏఐతో పనులు నిర్వహించాలని చూస్తున్నాయి. ఇందుకోసం టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటున్నాయి. తాజాగా ఇండియా దిగ్గజ కంపెనీ అయిన విప్రో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో తమ కంపెనీలో ఏఐని ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఇందులో కోసం కొందరు ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. వీటి కోసం కంపెనీ రూ.8,200 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు సమాచారం.

ఏఐ వినియోగంపై విప్రో అధికారికంగా సంచలన ప్రకటన చేసింది. త్వరలో ఏఐ వినియోగంపై శిక్షణ ఇస్తున్నామని, ఇందు కోసం 2,50,000 మంది ఉద్యోగులకు ఫండమెంటల్స్, బాధ్యాతాయుత వినియోగం గురించి వివరిస్తామని తెలిపింది. ఆగస్టు 2023 నుంచి దీనిని ప్రారంభించి ఏడాది పాటు శిక్షణ ఇస్తామని తెలిపింది. దీంతో ఇండియన్ కంపెనీలు సైతం ఏఐకి అలవాటు పడడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఏఐ ప్రభావం విప్రో ఉద్యోగలుపై పడనుందా? అనే చర్చ సాగుతోంది.

ప్రపంచానికి అనుగుణంగా మారేందుకే విప్రో ఏఐ బాట పడుతుందని కొందరు సమర్థిస్తున్నారు. కానీ ఏఐని ప్రవేశపెట్టడం ద్వారా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారని అంటున్నారు. ఇదిలా ఉండగా ఏఐ శిక్షణ కోసం విప్రో దేశ వ్యాప్తంగా ఉన్న 2,50,000ల మందికి శిక్షణ ఇవ్వనుంది. ఏఐకి సంబంధించిన ప్రాథమిక శిక్షణ వీరికి ఇవ్వనుంది. ఇందులో కోసం 360 బిలియన్ డాలర్లు (రూ.8,200) ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.

ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టే తరుణంలో స్టార్టప్ లలో ఇన్వెస్్ కూడా చేయడంతో పాటు జెన్ ఏఐ సీడ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ద్వారా జనరేటివ్ ఏఐ ఆధారిత స్టారప్ లకు శిక్షణ ఇవ్వనుంది. దీంతో కొంతకాలం పాటు మనుషులు కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేసిన తరువాత ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేలా చూస్తారు. ఆ తరువాత ఏఐ తన విధులును నిర్వహిస్తుందని చెబుతున్నారు. అయితే మిగతా కంపెనీలు ఇదే నిర్ణయాన్ని తీసుకుంటాయా? అనేది చూడాలి.