https://oktelugu.com/

Winter: చలికాలంలో కీళ్ల సమస్యలు తగ్గాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటించండి

ప్రస్తుతం చలి తీవ్రత(Winter) ఎక్కువగా ఉంటుంది. చలి వల్ల ఎక్కువగా వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వృద్ధులు(Aged Persons) అయితే ఈ కాలంలో శ్వాసకోశ, కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే చలికాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా(Healthy) ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే సమస్య తీవ్రం కాదు. కీళ్ల నొప్పుల వల్ల వృద్ధులు ఈ కాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 10, 2025 / 03:59 AM IST

    Bones Health

    Follow us on

    Winter: ప్రస్తుతం చలి తీవ్రత(Winter) ఎక్కువగా ఉంటుంది. చలి వల్ల ఎక్కువగా వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వృద్ధులు(Aged Persons) అయితే ఈ కాలంలో శ్వాసకోశ, కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే చలికాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా(Healthy) ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే సమస్య తీవ్రం కాదు. కీళ్ల నొప్పుల వల్ల వృద్ధులు ఈ కాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. నడవడం, నిలబడడం, బట్టలు ధరించడం లేదా వస్తువులను పట్టుకోవడం వంటి పనులు కూడా వారికి కష్టంగా ఉంటాయి. వీటితో బాగా ఒత్తిడికి(Stress) లోనవుతారు. అయితే చలికాలంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా జీవనశైలిని మార్చాలి. అప్పుడే నొప్పి లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చలికాలంలో ముసలి వాళ్లు కీళ్ల సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన ఆ చిట్కాలేంటో(Tips) ఈ స్టోరీలో చూద్దాం.

    తక్కువ ఉష్ణోగ్రతల వల్ల వృద్ధులకు కీళ్ల చుట్టూ కండరాలు పట్టేస్తాయి. దీంతో నొప్పి, వాపు వస్తుంది. ఇది ఎక్కువ అయ్యి కొందరికి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ సమస్యను తగ్గించాలంటే మాత్రం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇంటి లోపల కాస్త వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. అసలు కీళ్ల సమస్యలు రావు. అలాగే ఎక్కువగా ఒత్తిడికి గురి కావద్దు. ఇండోర్ గేమ్స్ ఆడండి. పెద్ద పెద్ద వ్యాయామాలు కాకుండా చిన్నవి చేయాలి. కొందరు వృద్ధులు చలికాలంలో ఎక్కువగా బయటకు వెళ్తుంటారు. ఇలా బయట గాలి తగిలినప్పుడు వారికి కీళ్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే చల్ల గాలి తగలకుండా చూసుకోవాలి. చలికాలంలో వృద్ధులు గాలులు తగలకుండా థర్మల్ దుస్తులు ధరించాలి. స్వెటర్లు, చేతులకు గ్లైజ్‌లు ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

    పలుచని కాకుండా దట్టమైన దుప్పట్లు వాడాలి. పోషకాలు ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఆకు కూరలు, గింజలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు తినాలి. చలికి కారం తినాలని బయట ఫుడ్ ఎక్కువగా తినకూడదు. వీటికి దూరంగా ఉంటూ.. తగినంత నీరు తాగాలి. బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంట్లో హీటింగ్ ప్యాడ్‌లను ఉపయోగించాలి. దీనివల్ల ఇంట్లో చల్లగా ఉండకుండా వేడిగా ఉంటుంది. అలాగే చల్లని పదార్థాలు అసలు తాగకుండా.. వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. చల్లని నీటితో స్నానం కాకుండా కేవలం వేడి నీటితో మాత్రమే స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల కీళ్ల సమస్యలు తగ్గుతాయి. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.