https://oktelugu.com/

Winter season: చలికాలంలో సాక్స్‌లు వేసుకుని నిద్రపోతే.. ఏమవుతుందంటే?

చలికాలంలో ఇంటిలో ఎక్కడ అడుగు పెట్టిన కూడా చల్లగా తగులుతుంది. దీంతో కొందరు కాళ్లకు చల్లగా ఉండకుండా సాక్స్‌లు ధరిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కాళ్లకు సాక్స్‌లు ధరిస్తుంటారు. అయితే కాళ్లకు సాక్స్‌లు ధరించి నిద్రపోవచ్చా? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఏవైనా వస్తాయా? లేకపోతే ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా? అనే పూర్తి విషయాలు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 3, 2025 / 11:31 PM IST

    winter wearing sox

    Follow us on

    Winter season: ప్రస్తుతం చలి తీవ్రత పెరిగిపోతుంది. ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేవలం బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి చంపేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. దీనివల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తున్నాయి. రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల చాలా మంది ఈ చలికాలంలో వచ్చే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం వంటివి చిన్నగా వచ్చిన కూడా ఎక్కువ అవుతాయి. అయితే చలికాలంలో ఇంటిలో ఎక్కడ అడుగు పెట్టిన కూడా చల్లగా తగులుతుంది. దీంతో కొందరు కాళ్లకు చల్లగా ఉండకుండా సాక్స్‌లు ధరిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కాళ్లకు సాక్స్‌లు ధరిస్తుంటారు. అయితే కాళ్లకు సాక్స్‌లు ధరించి నిద్రపోవచ్చా? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఏవైనా వస్తాయా? లేకపోతే ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా? అనే పూర్తి విషయాలు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    శీతాకాలంలో కాళ్లు చల్లగా ఉండకూడదని కొందరు కాళ్లకు సాక్స్ ధరించి నిద్రపోతారు. అయితే ఇలా కాళ్లకు సాక్స్ ధరించి నిద్రపోవడం వల్ల మేలు అని నిపుణులు చెబుతున్నారు. సాక్సులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. దీనివల్ల చలి లేకుండా వెచ్చగా ఉంటుంది. దీంతో మీరు తొందరగా నిద్రపోతారని నిపుణులు అంటున్నారు. అలాగే రక్తప్రసరణ కూడా పెరుగుతుందట. సాధారణంగా శీతాకాలంలో కాళ్లు చల్లగా అయపోతాయి. దీంతో రక్తనాళాలు సంకోచం చెందడంతో రక్త ప్రసరణ తగ్గుతుంది. అదే సాక్స్‌లు వేసుకుంటే వేడి వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి రక్త ప్రసరణ చాలా ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటేనే గుండె, అవయవాలు అన్ని కూడా పనిచేస్తాయి. శరీర భాగాలకు రక్త సరఫరా సాఫీగా సాగాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. రక్తప్రసరణ మెరుగు పడటం వల్ల కండరాలు కూడా బలంగా ఉంటాయి. కాళ్లకు సాక్స్‌లు ధరించడం వల్ల పాదాలు పగుళ్లు రావు. సాధారణంగా ఈ కాలంలో పగుళ్లు ఎక్కువగా వస్తాయి. చర్మం పొడి బారుతుంది. అదే సాక్స్‌లు ధరిస్తే ఈ సమస్య ఉండదు. అయితే పాదాలకు ఆలివ్ ఆయిల్ రాసి ఇలా సాక్స్‌లు ధరిస్తే హాయిగా నిద్రపట్టడంతో పాటు పగుళ్లు కూడా తగ్గుతాయి. అలాగే చర్మం కూడా మృదువుగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే సాక్స్‌లను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ రోజులు ఒకే సాక్స్‌లు వాడకూడదు. కనీసం రెండు నుంచి మూడు రోజులకు అయిన వాష్ చేయాలి. అప్పుడే మీ చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే కొందరు బాగా టైట్‌గా ఉండే సాక్స్‌లను ధరిస్తారు. ఇలాంటివి ధరిస్తే సరిగ్గా రక్తప్రసరణ జరగదు. కాబట్టి బాగా టైట్ కాకుండా సరిగ్గా కాళ్లకు సరిపోయే విధంగా ధరించాలని నిపుణులు సూచిస్తారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.