https://oktelugu.com/

Winter season: చలి కాలంలో ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారట.. ఇందులో నిజమెంత?

మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తారని కొందరు అంటున్నారు. ఎందుకంటే చలికాలంలో బద్ధకం (Lazy) వల్ల ఏ పని చేయకుండా ఒకే దగ్గర ఉండి బాధపడుతుంటారు. ఒకే విషయంపై ఇలా బాధపడుతూ చివరకు డిప్రెషన్‌లోకి (Depression) వెళ్తుంటారు. దీనికి తోడు చలికాలంలో సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేరు. వీటివల్ల కూడా డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చలికాలంలో డిప్రెషన్‌ నుంచి విముక్తి పొందడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2025 / 03:44 AM IST

    depression

    Follow us on

    Winter season: ప్రతీ ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో డిప్రెషన్‌లోకి (Depression) వెళ్తుంటారు. వ్యక్తిగత కారణాలు, అనుకున్న పనులు జరగలేదని కొందరు ఇలా డిప్రెషన్‌లోకి వెళ్తారు. అయితే మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తారని కొందరు అంటున్నారు. ఎందుకంటే చలికాలంలో బద్ధకం (Lazy) వల్ల ఏ పని చేయకుండా ఒకే దగ్గర ఉండి బాధపడుతుంటారు. ఒకే విషయంపై ఇలా బాధపడుతూ చివరకు డిప్రెషన్‌లోకి (Depression) వెళ్తుంటారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలా కష్టాలు, సుఖాలు అనేవి సర్వసాధారణం. వీటిని గుర్తు చేసుకుంటూ బాధపడటం (Sad) కంటే అన్నింటిని వదిలేయడం మంచిది. అయితే కొందరు వచ్చిన ప్రాబ్లెమ్స్‌ను (Problems) లైట్ తీసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా.. అయిపోయిన వాటి గురించి బాధపడుతుంటారు. ఇలా బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మళ్లీ మీరు సమయం వృథా చేసుకోవడం తప్పా ఇంకా ఏం ఉండదు. ఇలా కొందరు డిప్రెషన్‌లోకి (Depression) వెళ్లి.. ఒంటరి జీవితాన్ని అనుభవిస్తారు. దీని వల్ల వారు ఎవరితో కలవకుండా ఎప్పటికీ బాధగానే ఉంటారు. దీనికి తోడు చలికాలంలో సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేరు. వీటివల్ల కూడా డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చలికాలంలో డిప్రెషన్‌ నుంచి విముక్తి పొందడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

    ఈ ప్రపంచంలో దాదాపుగా 21 శాతం మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. కేవలం పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తలనొప్పి, కండరాల నొప్పి, కడుపు తిమ్మిరి, అజీర్ణం, నిద్రలేమి, శ్వాస సమస్యలు వస్తాయి. అలాగే గుండె పోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే మాత్రం తప్పకుండా నవ్వుతుండాలి. పెద్దవారు రోజుకి కేవలం 20 సార్లు మాత్రమే నవ్వుతారు. వయస్సు పెరిగే కొద్దీ నవ్వడం ఆపేస్తారు. దీనివల్ల కూడా డిప్రెషన్ లోకి వెళ్తారు. కాబట్టి నవ్వడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల డిప్రెషన్ దూరమవుతుంది. రోజూ కొంత సమయం ఎండలో కూర్చోండి. దీని వల్ల మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలాగే వాకింగ్, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండండి. ఒంటరిగా ఉండే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. దీంతో మీరు డిప్రెషన్‌లోకి వెళ్తారు. అదే ఒంటరిగా ఉండకుండా ఎల్లప్పుడూ బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మంచి పుస్తకాలు చదవడం, ఎల్లప్పుడూ వర్క్‌లో బిజీగా ఉండటం, పాటలు వినడం వంటివి చేస్తుండండి. వీటివల్ల కూడా మీరు డిప్రెషన్ నుంచి బయట పడతారు.

    ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు డిప్రెషన్ నుంచి విముక్తి కలిగించే పదార్థాలను మాత్రమే తీసుకోండి. రోజూ పండ్లు, కూరగాయల జ్యూస్ తాగండి. అలాగే డ్రై ఫ్రూట్స్ తినడం, గ్రీన్ టీ తాగడం, పసుపు పాలు తాగడం, పెరుగు వంటి ప్రో బయోటిక్స్ తినడం, అవిసె గింజలు తీసుకోవడం వంటివి చేయాలి. ఇలాంటి వాటిని తినడం వల్ల ఈజీగా డ్రిపెషన్ నుంచి బయట పడతారు. అలాగే చలి నుంచి కూడా విముక్తి పొందుతారు. చలి వల్ల వచ్చే డిప్రెషన్ కాబట్టి ఫస్ట్ శరీరానికి వెచ్చగా అనిపించే వాటిని తీసుకోవాలి. అప్పుడే మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.