Winter Season: ప్రస్తుతం చలి తీవ్రత బీభత్సంగా ఉంది. రోజులో తక్కువగా ఉన్నా కూడా రాత్రి సమయాల్లో అయితే చలి పెరిగిపోతుంది. కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. ఈ చల్లని గాలుల వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వంటి బారిన పడుతున్నారు. చలికాలంలో వాటర్ తక్కువగా తాగడం, చలి వల్ల కొందరికి రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయ. అదే రోగనిరోధక శక్తిని(Immunity Power) పెంచే పదార్థాలను తీసుకుంటే చలికాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. అయితే ఈ కాలంలో అందరూ కూడా పోషకాలు ఉండే గ్రీన్ జ్యూస్(Green Juice) తాగాలి. దీన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ కాలంలో తాగాల్సిన ఆ గ్రీన్ జ్యూస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఔషధ గుణాలు ఉండే కలబంద(Alovera) గురించి అందరికీ తెలిసిందే. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కలబందలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి బాగా సహకరిస్తాయి. చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్న వారు డైలీ గ్లాసు కలబంద రసం తాగడం వల్ల ఎలాంటి సమస్యలు దరిచేరవు. దీంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కలబందలోని విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఈ జ్యూస్ తాగడానికి చాలా చేదుగా ఉంటుంది. కానీ కష్టమంగా అయిన కూడా ఏదో విధంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ డైట్‌లో కలబంద రసం తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే సమస్యలు అన్ని కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
కలబంద రసం తాగడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు ఈజీగా బరువు తగ్గుతారు. ఇందులోని పోషకాలు కేవలం శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండె పోటు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. డైలీ ఉదయం పరగడుపున కలబంద రసం తాగడం వల్ల శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. తాగడానికి చేదుగా ఉండే కలబంద రసంలో కాస్త చక్కెర లేదా బెల్లం కలుపుకుని అయిన తాగవచ్చు. ఈ జ్యూస్‌ను డైలీ తాగడం వల్ల చలికాలంలో వచ్చే అన్ని అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.