https://oktelugu.com/

Winter season: చలి కాలంలో కొబ్బరి నూనె గడ్డ కట్టకూడదంటే.. ఇలా చేయండి

గాజు సీసాలో కొబ్బరి నూనె ఉంటే ఒక రకం. కానీ ప్లాస్టిక్ వాటిలో ఉంటే మాత్రం వాటిని అసలు తీయలేరు. అందులోని కొబ్బరి నూనె వాడటానికి చాలా ఇబ్బంది పడతారు. అసలు చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కట్టకుండా ఉండదా? అసలు కొబ్బరి నూనె ఎందుకు గడ్డ కడుతుంది? ఇలా కాకూడదంటే ఏం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2025 / 04:48 AM IST

    Coconut Oil

    Follow us on

    Winter season: సాధారణంగా చలికాలంలో ఏ వస్తువు అయిన కూడా గడ్డకడుతుంది. ముఖ్యంగా మనం ఉపయోగించే నూనె అయితే తప్పకుండా అవుతుంది. చలికాలంలో(Winter Season) ఎక్కువ మంది బాడీకి లోషన్ బదులు కొబ్బరి (Coconut Oil) లేదా నువ్వుల నూనె వంటివి వాడుతారు. చర్మం (Skin), జుట్టు (Hair) ఆరోగ్యం కోసం ఎక్కువగా కొబ్బరి నూనెను వినియోగిస్తారు. అయితే కొబ్బరి నూనె చలికాలంలో గడ్డకడుతుంది. ఇందులోని పోషకాలు జుట్టు, చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టుతో పాటు చర్మా్న్ని (Skin) రక్షిస్తాయి. అయితే ఏదో విధంగా ఈ కొబ్బరి నూనెను (Coconut Oil) చలికాలంలో కొందరు వాడుతూనే ఉంటారు. అయితే ఇలా వాడేటప్పుడు అందరూ బాగా ఇబ్బంది పడే సమస్య కొబ్బరి నూనె గడ్డ కట్టడం. దీనిని ఎంత జాగ్రత్తగా ఎండలో పెట్టిన కూడా కొబ్బరి నూనె గడ్డ కడుతుంది. గాజు సీసాలో కొబ్బరి నూనె ఉంటే ఒక రకం. కానీ ప్లాస్టిక్ వాటిలో ఉంటే మాత్రం వాటిని అసలు తీయలేరు. అందులోని కొబ్బరి నూనె వాడటానికి చాలా ఇబ్బంది పడతారు. అసలు చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కట్టకుండా ఉండదా? అసలు కొబ్బరి నూనె ఎందుకు గడ్డ కడుతుంది? ఇలా కాకూడదంటే ఏం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

    మిగతా నూనెలతో పోలిస్తే కొబ్బరి నూనె చలికాలంలో గడ్డ కడుతుంది. కొబ్బరి నూనె 24 డిగ్రీల ఉష్ణోగ్రత లేదా దీని కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే ద్రవ రూపంలో ఉంటుంది. వీటి కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే మాత్రం తప్పకుండా కొబ్బరి నూనె గడ్డ కడుతుంది. సాధారణంగా చలికాలంలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. వీటి కారణంగానే చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కడుతుంది. చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కట్టకుండా ఉండాలంటే మాత్రం.. దానిని వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. వంటగదిలో గ్యాస్ లేదా మైక్రో ఓవెన్‌లో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల వేడి వల్ల తొందరగా కొబ్బరి నూనె గడ్డ కట్టదు. కొబ్బరి నూనెను సూర్యరశ్మి తగిలేలా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల నూనె గడ్డకట్టదు.

    కొబ్బరి నూనె గడ్డకట్టకుండా ఉండాలంటే ఇందులో వేరే ఇతర నూనెలు కలపాలి. అంటే గడ్డ కట్టని నూనెలు మాత్రమే కలపాలి. ఆలివ్ నూనె, ఆవాల నూనె, ఉసిరి నూనె, నువ్వుల నూనె వంటివి కొబ్బరి నూనెలో కలపాలి. ఇలా చేస్తే కొబ్బరి నూనె చలికాలంలో గడ్డకట్టకుండా ఉంటుంది. కొబ్బరి నూనెను ప్లాస్టిక్ వాటిలో కాకుండా మట్టి, గాజు, సిరామిక్ జార్‌లో పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రలు తొందరగా కొబ్బరి నూనె గడ్డకట్టకుండా చేస్తాయి. మట్టి లేదా గాజు సీసా, సిరామిక్ జార్‌లో అయిన స్టోర్ చేయాలి. ఈ పాత్రల్లో స్టోర్ చేస్తే కొబ్బరి నూనె గడ్డకట్టదని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.