Winter season foods: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్లు అయిన కూడా సరిపడా నిద్ర ఉండాలి. అయితే ఈ శీతాకాలంలో(Winter Season) చల్లని గాలుల వల్ల చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టదు. నిద్ర అయితే వస్తుంది.. కానీ హాయిగా నిద్ర పట్టదు(Sleepless). దీనికి తోడు బిజీ లైఫ్(Busy Life) వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం(Moring) లేటుగా లేస్తున్నారు. పగలు ఎంత పడుకున్న.. రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల నిద్ర అవసరం అవుతుంది. నిద్ర లేకపోతే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. బాడీకి సరైనా నిద్ర లేకపోవడం వల్ల గుండెపోటు(Heart Attack), టైప్ 2 డయాబెటిస్(Diabetic), ఊబకాయం, డిప్రెషన్(Depression) వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. వీటితో పాటు మానసిక సమస్యలు కూడా తప్పవు. అయితే చలికాలంలో హాయిగా నిద్రపట్టాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
చెర్రీస్
రాత్రి నిద్రపోయే ముందు చెర్రీ పండ్లను తినడం వల్ల చలికాలంలో హాయిగా నిద్రపడుతుందని నిపుణులు అంటున్నారు. నిద్రకు సహాయపడే మెలటోనిన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల హాయిగా నిద్రపడుతుంది.
డ్రైఫ్రూట్స్
వీటిలో మెలటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచడంలో మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.
అరటిపండ్లు
వీటిలో పోషకాలు హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి. నిద్రపోయే ముందు అరటి పండ్లను తినడం వల్ల నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. అయితే డైలీ నిద్రపోయే ముందు అరటి పండు తినడం వల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునే వారు మాత్రం అరటి పండును స్కిప్ చేయండి.
ద్రాక్ష పండ్లు
రాత్రిపూట నిద్ర పట్టని వాళ్లు ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకుంటారు. ఇందులో కూడా మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. ద్రాక్ష పండ్లు వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తొందరగా వృద్ధాప్య ఛాయలు రావు. యంగ్ లుక్‌లో కనిపిస్తారు.
చిలగడ దుంపలు
పోషకాలు పుష్కలంగా ఉండే చిలగడ దుంపలను తినడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. డైలీ వీటిని తినడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాల వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. డైలీ చిలగడ దుంపలను తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. ఫిట్‌గా ఉండాలనుకునే వారు వీటిని తీసుకోవడం ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.