https://oktelugu.com/

Winter: శీతాకాలంలో ఈ ఆకు తింటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్

చలి వల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. ఈ చలి నుంచి విముక్తి చెందడానికి కేవలం చిట్కాలు మాత్రమే పాటించకుండా ఆహార విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే పదార్థాలను మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 29, 2024 / 01:17 AM IST

    Bathua leaves

    Follow us on

    Winter: చలికాలం వచ్చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. చలి వల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. ఈ చలి నుంచి విముక్తి చెందడానికి కేవలం చిట్కాలు మాత్రమే పాటించకుండా ఆహార విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే పదార్థాలను మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో బతువా ఒకటి. దీన్ని చలికాలంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు చలి లేకుండా వెచ్చగా కూడా ఉంటుందట. ఈ బతువాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో బాగా సహాయపడతాయి. కనీసం వారానికి ఒకసారి అయిన ఈ బతువా ఆకును తినడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి బతువా ఆకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

    బతువా ఆకుకూరను ఒక్కటి కంటే ఇంకో ఆకు కూరతో కలిపి ఎక్కువగా వండుతారు. ముఖ్యంగా ఈ ఆకు కూరను పాలకూరతో కలిపి వండుతారు. ఇలా కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందట. అలాగే ఈ ఆకు కూరను పెరుగుతో కలిపి కూడా కొందరు తింటారు. ఇలా తినడం వల్ల ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అనారోగ్య సమస్యలు అన్నింటి నుంచి కూడా విముక్తి కల్పిస్తుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి బతువా ఆకుకూరతో ఉపశమనం లభిస్తుంది. బతువా ఆకులను కరివేపాకుతో కలిపి తింటే మలబద్ధకం సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు అన్నింటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

    కొందరు మూత్ర విసర్జన దగ్గర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ బతువా ఆకును తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట, ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఈ బతువా రసంలో నల్ల ఉప్పు కలిపి తినడం వల్ల కూడా కడుపులోని నులిపురుగులు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. డైలీ ఈ ఆకులను తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలే కానీ నష్టాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఈ బతువా రసాన్ని ముఖంపై అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు అన్ని తొలగిపోతాయట.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.