https://oktelugu.com/

Winter bath: చలికాలంలో స్నానం చేయడం మానేస్తే.. ఏమవుతుందో మీకు తెలుసా?

చలికాలంలో స్నానం చేయడం మానేస్తే ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. తక్కువ శరీర ఉష్ణోగ్రతలు ఉన్న ఎలుకలు 20 శాతం ఎక్కువ కాలం జీవించాయి. దీంతో చలికాలంలో స్నానం చేసే వారికంటే చేయని వారు ఎక్కువ కాలం జీవిస్తారని నిపుణులు తెలిపారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 10, 2025 / 06:26 AM IST

    bath

    Follow us on

    Winter bath: ప్రస్తుతం చలి తీవ్రత పెరిగిపోయింది. ఏ సమయంలో అయిన బయటకు వెళ్లకుండా అలా దుప్పటి కప్పుకుని నిద్రపోవాలని చూస్తున్నారు. నిజానికి కొందరికి స్నానం కూడా చేయాలనిపించదు. అసలు చల్లని నీటిని ఏ విధంగా కూడా తాకకూడదని అనుకుంటారు. అయితే ఈ చలికాలంలో చాలా మంది రెండు లేదా మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. అదే ఉత్తర భారత దేశంలో అయితే చలి తీవ్రతను తట్టుకోలేక చాలా మంది వారం రోజులకు కూడా స్నానం చేస్తుంటారు. సాధారణంగా ఒక్క రోజు స్నానం చేయకపోతేనే చిరాకు, అనారోగ్య సమస్యలు వస్తాయని కొందరు అంటుంటారు. కానీ చలికాలంలో స్నానం చేయడం మానేస్తే ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. తక్కువ శరీర ఉష్ణోగ్రతలు ఉన్న ఎలుకలు 20 శాతం ఎక్కువ కాలం జీవించాయి. దీంతో చలికాలంలో స్నానం చేసే వారికంటే చేయని వారు ఎక్కువ కాలం జీవిస్తారని నిపుణులు తెలిపారు. ఎవరైతే చలికాలంలో తక్కువగా స్నానం చేస్తారో వారి ఆయుష్షు 34 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. దీనిబట్టి చూస్తే చలికాలంలో స్నానం చేసే వారికంటే చేయని వారే ఎక్కువ కాలం జీవిస్తారు.

    చలి కాలంలో స్నా నం చేయకపోవడం వల్ల జీవక్రియ రేటు తగ్గుతుంది. దీంతో శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా మన శరీరం వృద్ధాప్య ప్రక్రియతో ముడిపడి ఉంటాయి. వీటివల్ల స్నానం చేయకపోయిన కూడా తొందరగా వృద్ధాప్యం రాదు. అయితే దీనికి ఇంకా సరైన ఆధారాలు లేవని మరికొందరు అంటున్నారు. స్నానం చేయకపోతే ఆయుష్షు పెరుగుతుందని చేయడం మానేస్తే ఇంకా చర్మ సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా స్నానం చేయడం మానేస్తే చర్మంపై చెమట పెరిగిపోవడంతో పాటు ధూళి కణాలు పేరుకుపోతాయి. దీంతో చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి చలికాలంలో పూర్తిగా స్నానం చేయడం మానేయవద్దు.

    చలికాలంలో కొందరు బాగా వేడి నీరుతో స్నానం చేస్తుంటారు. అయితే ఇలాంటి వేడి నీటితో స్నానం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో బాగా చల్లని లేదా వేడి కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. గోరువెచ్చని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం క్లియర్ అవుతుందని, ఎలాంటి క్రిములు కూడా ఉండవు. కాబట్టి ఎక్కువ రోజులు స్నానం చేయకుండా ఉండవద్దు. కనీసం రెండు రోజలకు ఒకసారి అయిన స్నానం చేయడం అలవాటు చేసుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. స్నానం చేయకపోతే బాడీ నుంచి దుర్వాసన వస్తుంది. దీనివల్ల మీరు ఇతరుల పక్కన కూర్చోలేరు. మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. కాబట్టి చలి అని స్నానం చేయడం మానవద్దు. తప్పకుండా స్నానం చేయడం మాత్రం అలవాటు చేసుకోండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.