Wife And Husband Relationship: వివాహితుల మధ్య ప్రేమ పెరగడానికి శారీరక సాన్నిహిత్యం అవసరమా?

భార్య,భర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రేమగా ఉంటే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే ఈ ప్రేమ శాశ్వతంగా ఉండడానికి వీరి మధ్య శారీరక సాన్నిహిత్యం కూడా అవసరం అని చాలా మంది మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : February 11, 2024 2:02 pm

Wifie Husband Relationship

Follow us on

Wife And Husband Relationship: వివాహం బంధం ఎంతో పవిత్రమైనది. రెండు వేర్వేరు మనుషులు, దేహాలు ఒక్కటయ్యే పవిత్ర కార్యక్రమం. ఒకరికి ఒకరు తెలియకపోయినా వైవాహిక జీవితం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒక్కటై జీవితాంతం కలిసి ఉంటారు. వీరి మధ్య ప్రేమ, ద్వేషం, కోప తాపాలు ఉంటాయి. అయితే వివాహితులు సంతోషంగా గడపడానికి ప్రేమ అవసరం. భార్య,భర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రేమగా ఉంటే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే ఈ ప్రేమ శాశ్వతంగా ఉండడానికి వీరి మధ్య శారీరక సాన్నిహిత్యం కూడా అవసరం అని చాలా మంది మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా ‘5 లవ్ లాంగ్వేజేస్’ అనే పుస్తకంలో రచయిత గ్యారీ చాప్ మన్ వివాహితుల మధ్య సాన్నిహిత్యాన్ని గురించి వివరించారు. ఆ విశేషాల్లోకి వెళితే..

ఇద్దరు వ్యక్తులు శారీరకంగా సాన్నిహిత్యంగా ఉండడం అంటే వేరే అర్థాన్ని తీస్తారు. కానీ భార్య, భర్తల మధ్య ధ్రుఢమైన ప్రేమ ఉండాలంటే ఇది తప్పని సరి. ఈ కలయిక వల్ల మనసు ఉత్తేజితం అవుతుంది. దంపతులు ఎవరైనా నుదుటిపై ముద్దుపెట్టినప్పడు శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒకసారిక కలయిక వల్ల వారి మధ్య ఉన్న దూరం చెదిరిపోయి కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉండగలుగుతారు.

జీవిత భాగస్వామిపై ఎంత ప్రేమ ఉంటే అంత సాన్నిహిత్యం కలుగుతుంది. ఈ ప్రేమలో భాగంగా వీరి మధ్య కలయిక ఏర్పడడం వల్ల ఇద్దరికి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఒక వ్యక్తిపై మరో వ్యక్తికి ఎంత ప్రేమ ఉంది అనేది దీని ద్వారా తెలుస్తుంది. అప్పటి వరకు ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. పెళ్లి కాగానే శోభనం ఏర్పాటు చేయడంలోనూ ఒక అర్థం ఉందని అంటున్నారు. ఇద్దరు తెలియని వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని కలిగించడానికి ఈ కార్యాన్ని ఏర్పాటు చేస్తారు.

ఆ తరువాత జీవితంలో చాలా సార్లు ఇలా సాన్నిహిత్యంగా ఉండడం వల్ల శరీరం యవ్వనంగానూ ఉంటుది. ఒకరికి మరొకరు చేసే కొన్న స్పర్శల వల్ల లోతైన భావాలు బయటపడుతాయి. దీంతో ఎదుటి వ్యక్తిపై మరింత ప్రేమ పెరుగుతుంది. ఇది జీవితాంతం వారితో కలిసి ఉండే విధంగా ఉంచుతుంది. శారీరక ప్రేమ అవసరమా? అని కొందరు సందేహం వక్తం చేసినా.. ఇది ఉండడం వల్ల దంపతుల మధ్య శాశ్వత బంధాన్ని కలుపుతుందని అనడంలో ఏమాత్రం తప్పులేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.