Gaining Weight After Marriage: ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురానుభూతి. జీవిత భాగస్వామిని చేసుకునే క్రమంలో నిర్వహించే వివాహంతో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అంతవరకు లేని చుట్టాలు దరిచేరతారు. దీంతో బంధుత్వం కూడా విస్తరిస్తుంది. దీంతో వైవాహిక జీవితంలో ఎన్నో మధురానుభూతులకు వివాహం ఒక్కటే వేదిక. ఈ నేపథ్యంలో రెండు కొత్త మనసులు కలయికతో కొత్త కాపురం ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. దీనికి పెళ్లి అనే తంతు మనకు ఉపయోగపడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి నడిచే బృహత్తర కార్యక్రమానికి బీజం పడేది ఇక్కడే. ఇక్కడి నుంచే మన జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. భవిష్యత్తుకు బాటలు వేసుకునే ప్రక్రియ కూడా ఇక్కడే ప్రారంభమవుతుంది.

వివాహం ఇద్దరికి ఎంతో సంతృప్తిని ఇచ్చేదిగా ఉంటుంది. అందుకే పెళ్లి తరువాత చాలా మంది మహిళలు బరువు పెరుగుతుంటారు. పెళ్లికి ముందు ఎంత సన్నా ఉన్నా వివాహం తరువాత బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తారు. ఎంత బక్కగా ఉన్న వారైనా పెళ్లి తరువాత ఒళ్లు చేయడం మామూలే. మహిళలు పెళ్లి తరువాత ఎందుకు బరువు పెరుగుతారు? అని అందరిలో ఓ ఆలోచన వస్తుంది. జీవిత భాగస్వామిని చేసుకున్న సంతోషంలో మహిళలు భవిష్యత్ పై బెంగ లేకుండా తమ భర్తతో కలిసి సుఖంగా సంసారం చేసుకోవాలని సంతోషంతో ఉంటారు.
Also Read: Bollywood Hope Liger Movie: అమీర్, అక్షయ్ ముంచేశారు… బాలీవుడ్ ఆశలన్నీ విజయ్ ‘లైగర్’ పైనే!
పెళ్లికి ముందు సన్నగా ఉన్నవారు సైతం కాస్త లావై బొద్దుగా కనిపించడం చూస్తుంటాం. లావుగా ఉన్న వారు మరింత బొద్దుగా మారుతారు. వివాహానికి ముందు కష్టపడి పనిచేసేవారు పెళ్లికి ముందు పనులు ఆపేస్తారు. దీంతో వారు లావుగా మారతారని తెలుస్తోంది. ఇక వివాహం జరిగి జీవితంపై భరోసా ఏర్పడటంతో పుష్టిగా తిని కాస్త ఒళ్లు పెంచుకుంటారని మరో వాదన ఉంది. వివాహానికి ముందు చదువుకోవడం వల్ల కూడా ఎంతో ఆతృత ఉంటుంది. జీవితంపై బెంగ ఉంటుంది. ప్రస్తుతం ఆ స్థితి పోవడంతో మహిళలు లావుగా మారతారని కూడా తెలుస్తోంది.

వివాహం తరువాత ఇంట్లో అందరు తిన్నాక తినే అలవాటు ఉండటంతో చివరికి మిగిలిపోయిన పదార్థాలను వృథాగా పడేయడం ఇష్టం లేకపోవడంతో వాటిని తినేందుకు మొగ్గు చూపుతుంది. దీంతో కాస్త ఒళ్లు చేయడం పరిపాటే. ప్రతి మహిళ వివాహం తరువాత రెండు కిలోల వరకు బరువు పెరుగుతుందని తెలుస్తోంది. పెళ్లికి ముందు ఇంకా కొన్నిపనులు చేసే మహిళ ఇంటికే పరిమితమై పనులు చేసుకుంటూ ఉంటుంది. అందుకే బరువు పెరుగుతుందని చాలా మంది చెబుతుంటారు.
Also Read:Rajasingh- Lawyer Karuna Sagar: రాజాసింగ్ తరుఫు న్యాయవాది సాగర్ సంచలన వ్యాఖ్యలు