Husband And Wife Relationship: ప్రతి వారికి పెళ్లి అనేది మధురానుభూతి. జీవిత భాగస్వామిని ఎంచుకుని ఆమెనే వివాహం చేసుకుని జీవితమంతా ఆమెతోనే గడపాలనే ఉధ్దేశంతోనే పెళ్లిని ఘనంగా చేసుకుంటారు. తరువాత వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలతో సతమతమవుతుంటారు. ఆధునిక కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. జంటల్లో ఎడబాటు కలుగుతోంది. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నవారే ఎక్కువ. అనురాగం, ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. అంతా యాంత్రిక జీవనంలా మారిపోతోంది. దీంతో శృంగార సమస్యలు వేధిస్తున్నాయి. ముప్పయిలోనే అరవై లాగా తమ జీవిత భాగస్వామితో సరిగా ఉండటం లేదు.

ఇటీవల వెల్లడిస్తున్న కొన్న గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పాతికేళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక ఇక శృంగారంపై మక్కువ అనేది చూపడం లేదు. ఫలితంగా భార్యలు మానసిక వేదన అనుభవిస్తున్నా పైకి మాత్రం చెప్పుకోవడం లేదు. ఎందుకింత ముబావం అంటే జీవితంలో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. దీంతో జీవిత భాగస్వామి తమ భర్త కోసం పనిచేసే యంత్రంలా మారిపోతోంది. కానీ శృంగార వాంఛలు మాత్రం తగ్గిపోతున్నట్లు పలు సర్వేలు సూచిస్తున్నాయి.
ఈ పరిస్థితికి కారణాలేంటి? ఎందుకు పురుషుల్లో శృంగార కాంక్ష తగ్గుతోంది. గతంలో ఎన్నేళ్లయినా శృంగార సమస్యలు వచ్చేవి కావు. వారు తమ జీవితంలో శృంగారం కూడా ఒక భాగంగా చూసుకునేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో శృంగారం కంటే తమ సంపాదనే ముఖ్యమని చూస్తున్నారు. అందుకే మరమనిషిలా ఏ రకమైన వాంఛలు లేకుండా బతుకు వెళ్లదీస్తున్నారు. ముచ్చటగా మూడు ముళ్లు వేసి తీరా పిల్లలు అయ్యాక ఇక ఆ పనే వద్దన్నట్లుగా ఉండటం సమంజసం కాదు. భార్య కోరికను తీర్చాలి. ఆమెకు ఉన్న శృంగార వాంఛలను కాదంటే ఇబ్బందే.

పిల్లలు పుట్టిన తరువాత శృంగారానికి దూరం ఉండాలని ఎవరు చెప్పరు. ఎందుకంటే పిల్లలు వారి పనుల్లో వారుంటే మనం మన పని చేసుకోవచ్చు. అంతేకాని వారి గురించి మన సుఖం పక్కన పెట్టడం భావ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య వేధిస్తోంది. భార్యాభర్తల మధ్య శృంగారం ఒక భాగంగా భావించే వారు తగ్గుతున్నారు. దీంతో మహిళల మనోభావాల్లో తమ బతుకు ఇంతేనా అనే వాదనలు కూడా వస్తున్నాయి. వారు పైకి చెప్పుకోకున్నా అంతర్గతంగా బాధపడుతున్నారు. భర్తలు భార్యల కోరికలను గమనించి వారిని సంతోషపెట్టేందుకు సిద్ధపడాలి.
సంసారమంటేనే ఇద్దరు కలిసి చేసేది. పెళ్లినాటి ప్రమాణాలు కూడా అదే చెబుతాయి. అన్నింట్లోను సహధర్మచారిణిగా ఉండే భార్యల అంతరంగాలను గమనించి వారి శృంగార కోరికలు తీర్చి వారిని బాగా చూసుకుంటేనే మనకు విలువ ఇస్తారు. అంతేకాని మన పని మనం చేసుకుంటూ పోతే వారిలో కూడా కోపం పెరుగుతుంది. అందుకే భార్యల ఉద్దేశాలను గమనించి వారికి నచ్చిన విధంగా ప్రవర్తించి సంసారాన్ని సుఖంగా చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.