https://oktelugu.com/

Girls mature : 8 నుంచి 10 సంవత్సరాలకే అమ్మాయిలు ఎందుకు మెచ్యూర్ అవుతున్నారు?

అమ్మాయిలు రజస్వల అవ్వడం కామన్ గా జరుగుతుంది. ఒకప్పుడు అమ్మాయిలు పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాల వయసులో ఇలా జరిగేది. ప్రస్తుత పరిస్థితులు మారిపోతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమ్మాయిలు 8 నుంచి 10 సంవత్సరాలకే పీరియడ్స్ వస్తున్నాయి. భారత్‌లో 15 శాతం మంది ఆడపిల్లలు 8 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే మార్పు వచ్చింది. కానీ ఈ మార్పు మంచిది కాదు. చిన్నప్పుడే మెచ్యూర్ అవ్వడం వల్ల ఆడపిల్లలు చాలా బాధలు పడాల్సి వస్తుంది. వారిని ఇది చాలా ఎమోషనల్‌గా ఇబ్బంది పెడుతుంది కూడా. బెస్ట్ క్యాన్సర్, జీవక్రియకు సంబంధించిన కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అసలు చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ ఎందుకు అవుతున్నారు? దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం..

Written By: Swathi Chilukuri, Updated On : November 9, 2024 9:24 pm

Why girls mature at 8 to 10 years?

Follow us on

Girls mature : చిన్న వయసులోనే ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలాంటి ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే త్వరగా పీరియడ్స్ వస్తాయట. అధిక కొవ్వు వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్, ఇన్సూలిన్ స్థాయిలు పెరిగి ఆడపిల్లలు యంగ్ ఏజ్‌లోనే ఈ సమస్యతో బాధ పడాల్సి వస్తుంది. ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్‌లో బిస్‌ఫెనాల్ – ఏ (బీపీఏ) అనే రసాయనం ఉంటుంది. ఇది జీవక్రియ, జీర్ణక్రియలకు అడ్డంకి కలిగిస్తుంది. ఇది శరీరంలో లోపల చేరి పలు సమస్యలకు కారణం అవుతుంది. బీపీఏ కంటెంట్ ఎక్కువ తీసుకున్న బాలికలు త్వరగా రజస్వలకు గురి అవుతుంటారు. అంటే ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ ఎక్కువ తినడం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది. సో పిల్లల విషయంలో వీటి గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి.

అమ్మాయిలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడానికి జీన్స్(జన్యువులు) కూడా ఒక కారణం. మరో ప్రధాన కారణం హార్మోన్లలో మార్పు అంటున్నారు నిపుణులు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంటాయి. హార్మోన్లు సాధారణంగా 9 నుంచి 14 సంవత్సారాల్లో పెరిగి పీరియడ్స్ వస్తాయి. కొందరు అమ్మాయిల్లో ఈ హార్మోన్లు చిన్న వయసులోనే పెరిగి త్వరగా మెచ్యూర్ అవడానికి కారణం అవుతున్నాయి.

మారిన జీవన శైలి, తినే ఆహారపు అలవాట్ల వల్ల కూడా బాలికలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. చాలా మంది వ్యాయామం, శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. అంతేకాకుండా స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ఏది పడితే అది తింటున్నారు. ఎక్కువ యానిమల్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. దీని వల్ల పీరియడ్స్ వస్తాయి. చిన్న, పెద్దా తేడా లేకుండా ఒత్తిడికి గురి అవుతున్నారు. ఒత్తిడి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడికి గురైతే.. హార్మోన్లు అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది చిన్న వయసులోనే పీరియడ్స్ ప్రారంభం అవుతున్నాయి.

అమ్మాయిలు పోషకాహార లోపంతో బాధపడుతూ చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్ డి, ఐరన్ వంటి వంటి పోషకాహార లోపిస్తాయి. ఈ పోషకాహార లోపం వల్ల చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తున్నాయి అంటున్నారు నిపుణులు. సో జాగ్రత్త