https://oktelugu.com/

Parents: తల్లిదండ్రులకు మొదటి సంతానంపై అంత ప్రేమ ఎందుకు? కారణమేంటి?

గ్యాప్ ఉంటే మీ కోడలికి ఇంకా పిల్లలు పుట్టలేదా? ఎందరు పిల్లలు? అయ్యో పలానా వారికి ఇంకా పిల్లలు పుట్టలేదట. వద్దనుకుంటున్నారా? ప్లాన్ చేసుకోవడం లేదా?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 11, 2024 / 04:36 PM IST

    Why do parents love their first child so much

    Follow us on

    Parents: కొందరు మహానుభావులు మాత్రమే డిఫరెంట్ లైఫ్ ను ఎంచుకుంటారు. కానీ మిగిలిన వారందరి జీవితం.. బాల్యం ఆపై స్కూల్, కాలేజ్, జాబ్ అంటూ పాత చింతకాయ పచ్చడి మాదిరి మాత్రమే ఉంటుంది. ఇందులోనే కష్టాలు, సుఖాలు, ఆటలు, పాటలు, లవ్వులు అంటూ అన్ని సాగుతాయి. దీని తర్వాత ఉండే ఘట్టమే బృహత్తర ఘట్టం అని చెప్పవచ్చు. అదేనండి పెళ్లి.. మరి పెళ్లి తర్వాత……. వామ్మో గ్యాప్ వద్దు.. ఆ గ్యాప్ లేకుండానే పిల్లలు పుట్టేయాలి.

    గ్యాప్ ఉంటే మీ కోడలికి ఇంకా పిల్లలు పుట్టలేదా? ఎందరు పిల్లలు? అయ్యో పలానా వారికి ఇంకా పిల్లలు పుట్టలేదట. వద్దనుకుంటున్నారా? ప్లాన్ చేసుకోవడం లేదా? ఎదగడానికి పిల్లలు అడ్డు వస్తున్నారని కనడం లేదంట అక్క విన్నావా వారి కోడలు చేష్టలు. ఈ కాలమే వేరుగా ఆలోచిస్తుంది అంటూ వామ్మో పొద్దున లేచిన దగ్గర నుంచి ఇలాంటి మాటలు మీరు కూడా వింటూనే ఉంటారా? అంత బాగుండి పిల్లలు సంవత్సరం లోపు పుడితే బాగుంటుంది లేదంటే అంతే సంగతి. ఇలా ఇన్ని మాటల మధ్య పిల్లలు పుడితే.. ఆనందమే వేరు.. అందుకే ఇప్పుడు మన టాపిక్…

    ఎన్నో మాటలు, ఎన్నో గొంతులు ప్రశ్నిస్తుంటే ఒక్కసారిగా ఏవండి నేను ప్రెగ్నెంట్.. కన్సివ్ అయ్యాను అంటే భర్త ఆలోచించకుండా భార్యను గాల్లో ఎత్తుకొని తిప్పుతాడు. ఇక ఆమె కడుపుతో ఉన్నప్పటి నుంచి ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. అప్పటికి ఇంట్లో లేని సందడి.. ఒక్కసారిగా కారు మబ్బులను చీలుస్తూ వెలుతురు వచ్చినంత సంతోషం ఉంటుంది ఆ ఇంట్లో.. అలా పాపైనా బాబైనా ఎవరు పుట్టినా కూడా ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. సమాజం ఏం అనుకుంటుదో అనే సందేహం. లేదా వారసులు కావాలనే కోరిక మొదటితో పోతుంది.

    రెండవ బేబీ కోసం ఎదురుచూస్తుంటారు దంపతులు. కానీ మొదటి పిల్లల వల్ల అప్పటికే అలిసి పోయి ఉంటారు. పిల్లల మీద ముద్దు ముచ్చట్లు కూడా తీరిపోతాయి. అయినా పిల్లలు పుట్టే వరకు పుట్టాలని ఎంత సంతోషపడుతామో.. వారు పెరుగుతుంటే కూడా అంతే సంతోషిస్తాము. కానీ వారు పెరిగే క్రమంలో పనులతో చాలా అలిసి పోతారు కూడా. అందుకే కాస్త మొదటి సంతానంపై ఉన్న ప్రేమ రెండవ సంతానం పై ఉండదనే చెప్పాలి. అంతేకాదు పిల్లలు పుట్టకంటే ముందు ఖర్చులు ఉంటాయని తెలుసుకుంటాం.

    ఖర్చులు ఉంటాయని తెలుసుకోవడం వేరు.. వాటిని ప్రత్యక్షంగా ఫీల్ అవడం వేరు. అందుకే పిల్లలు పెరుగుతంటే ఆ ఖర్చులు, కష్టాలు, అన్ని చూస్తూ పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలని.. పిల్లల మీద కంటే సంపాదన మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కొందరు తల్లిదండ్రులు. పరిస్థితులు ఏవైనా మొదటి సంతానం కంటే రెండవ సంతానం మీద కాస్త ప్రేమ తక్కువే ఉంటుందట.