Snakes In Anthills: ఎక్కడైనా పాము పుట్ట కనిపిస్తే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అందులో పాము ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పాములు నివసించే పుట్టలు వాస్తవానికి అవి నిర్మించుకోవు. చీమలు, చెదపురుగులు కలిసి ఎంతో కష్టపడి పాముల పుట్టను ఏర్పాటు చేస్తాయి. ఇలా తయారుచేసిన ఈ పుట్టలను పాములు ఆక్రమించి అందులో నివసిస్తూ ఉంటాయి. అసలు పాములు ఈ పుట్టలోనే నివసించడానికి కారణం ఏంటి? అంతేకాకుండా వాల్మీకి మహర్షికి ఈ పాము పుట్టకు ఎటువంటి సంబంధం ఉంది? పాము పుట్టను దేవాలయం తో ఎందుకు పోలుస్తారు?
పాములు కోల్డ్ బ్లడ్ శరీరాన్ని కలిగి ఉంటాయి. వీటికి ఎక్కువగా ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. అంతేకాకుండా వేడి ఉన్న సమయంలో చల్లటి వాతావరణం కావాల్సి ఉంటుంది. కాలాన్ని బట్టి పాములు తమ శరీరాలను రక్షించుకునేందుకు సురక్షితమైన నివాసం కోసం చూస్తుంటాయి. అయితే మిగతా వాటి కంటే చీమలు తయారుచేసిన పుట్టలు పాముకు అనుగుణంగా ఉంటాయి. అయితే చీమలు పెట్టే పుట్టల్లో ఒక ఆకర్షణీయ శక్తి ఉంటుంది. అంటే ఇందులో వేడి, చల్లదనం రెండు రకాల వాతావరణంలో ఉండి పాములకు సురక్షితంగా ఉంటాయి. అంతేకాకుండా పుట్టలో అనేక రకాల చీమలు, చెదపురుగులు పాములకు ఆహారంగా లభిస్తాయి. సంతానం కలగడానికి కూడా పాములకు పుట్టలు అనుగుణంగా ఉంటాయి. అందుకే పాములు పుట్టలను ఎంచుకుంటాయి.
అయితే ఈ పుట్టలో కేవలం పాముల కోసం మాత్రమే కాకుండా భూదేవి గర్భంగా భావిస్తారు. అంటే ఇది ఒక పవిత్రమైన దేవాలయంలో భావిస్తారు. అందుకే ప్రతి నాగుల చవితి, నాగుల పంచమి రోజున పుట్టల పాలు పోస్తూ ఉంటారు. పుట్ట నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీతో మహిళలకు అనేక రకాల కొత్త ఎనర్జీ వస్తుంది. అందుకే ఈ రెండు పర్వదినాల్లో పుట్టలో పాలు పోస్తుంటారు. అలాగే పాముల పుట్టలను దేవాలయాలతో పోలుస్తారు. దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన ఎనర్జీ వస్తుందో.. పుట్ట వద్దకు వెళ్ళినప్పుడు కూడా అంతే ఎనర్జీ వస్తుంది. అందుకే పాముల పుట్టను దేవాలయం తో పోలుస్తారు.
పాముల పుట్ట కు వాల్మీకి మహర్షికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. వాల్మీకి అంటే పాము పుట్ట. వాల్మీకి ఎన్నో రోజులుగా తపస్సు చేస్తూ సమయాన్ని మరిచిపోయాడు. ఈ క్రమంలో ఆ పని శరీరం చుట్టూ పుట్ట పెరుగుతుంది. అందుకే అతడికి వాల్మీకి మహర్షి అని పేరు వచ్చింది. ఈ విధంగా పాము పుట్ట ఎన్నో రకాల ప్రత్యేకతలు కలిగి ఉంది. అలాగే పాము పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి పాము పుట్ట మట్టిని కడుపుకు రాసుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.