White Sand Beach: హాలీడేస్ ను ఎంజాయ్ చేయాలి అనుకుంటే బీచ్ లు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి కదా. నీటి అలల మధ్య సరదాగా గడుపుతూనే, మన టెన్షన్లన్నింటినీ సులభంగా మరచిపోతాము. అలాగే, బీచ్ సెలవులు వేసవి సెలవులకు ఉత్తమమైన ప్రదేశంగా ఉంటాయి కూడా. మీరు మీ సెలవుల గమ్యస్థానంగా భారతదేశంలో ఉన్న అనేక బీచ్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు. కానీ మీ కళ్ళ ముందు కలల ప్రపంచం నిజమవుతుందని మీరు చూడాలనుకుంటే, మీరు ప్రపంచంలోని అనేక తెల్లని ఇసుక బీచ్‌లను అన్వేషించవచ్చు.
నీలిరంగు నీరు ఇసుకతో కూడిన తెల్లని బీచ్‌లను కలిసినప్పుడు, అది ఒక ఫాంటసీ ప్రభావాన్ని సృష్టిస్తుంది కదా. ఇది మనస్సును చాలా సంతోషపరుస్తుంది. కాబట్టి ఈ రోజు మనం ప్రపంచంలోని కొన్ని తెల్లని ఇసుక బీచ్‌ల గురించి తెలుసుకుందాము. తర్వాత ట్రై చేయండి కూడా.
వైట్‌హావెన్ బీచ్, ఆస్ట్రేలియా: ఈ బీచ్ లో ఆస్ట్రేలియాలో ఉంది. విట్‌సండే దీవుల మధ్యలో ఉంది ఈ బీచ్. దీన్ని సిలికా ఇసుక అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ నడవడం ఒక ప్రత్యేకమైన అనుభూతిలా అనిపిస్తుంది. అలాగే ఇక్కడి నీరు బాగా నీలం రంగులో ఉంటుంది. అందుకే ఈ బీచ్ మెరుస్తుంది కూడా.
నవాగియో బీచ్, గ్రీస్: గ్రీస్ లో ఉన్న ఈ నవాగియో బీచ్ ను షిప్‌రెక్ బీచ్ అని కూడా పిలుస్తుంటారు. నవాగియోలో సున్నపురాయి శిఖరాలు, ఉత్కంఠభరితమైన ఓడ శిథిలాలు, నీటి స్పష్టత చూస్తే ఆ రోజును మర్చిపోతాము. మీరు దాన్ని చూస్తే అది నిజమా? లేదా మనం వచ్చిన ప్రదేశం ఏమైనా ఫోటోషాప్ చేసి పెట్టారా అనేట్టుగా ఉంటుంది. అంత అందంగా ఉండే ఆ ప్రకృతిని చూసి నమ్మడం కూడా కష్టమే.
ఎక్సుమా, బహామాస్: ఇక్కడి జలాలు చాలావరకు పారదర్శకంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా అన్‌టచ్డ్ అవుట్ దీవులలో భాగమై ఉంటాయి. ముఖ్యంగా ఇవి పైలట్‌లకు మార్గదర్శక సాధనంగా ఉపయోగపడతాయి. ఈ బీచ్ మహా అద్భుతమనే చెప్పడంలో సందేహం లేదు.
అన్సే లాజియో, సీషెల్స్: ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్‌లలో ఒకటి ఈ అన్సేలాజియో. . ఇది ప్రాస్లిన్‌లో ఉంటుంది. పెనిన్సులా లాంచ్ బీచ్ దాని సిల్కీ వాటర్స్, అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌తో మీకు అందంగా, రమణీయంగా కనిపిస్తుంది.
హమోవా బీచ్, హవాయి: వైకికి కంటే చాలా తక్కువ జనాభా ఉండూ ఈ మౌయిలోని హమోవా బీచ్ ఉష్ణమండల వృక్షసంపదను కలిగి ఉంది. భారీ అలలు, చాలా స్పష్టమైన నీటితో అద్భుతంగా ఉంటుంది. పర్యావరణాన్ని ఇష్టపడే వారికి ఒక నిశ్శబ్ద స్వర్గం వంటి అనుభూతిని అందిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.