https://oktelugu.com/

ISRO Scientist: ఇస్రో(ISRO) శాస్త్రవేత్త కావాలంటే ఏ కోర్సు చదవాలి? ఎక్కడ చదవాలి?

జీవితంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలంటే కృషి, పట్టుదల ఉండాలి. అయితే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలంటే కూడా అంతే కసి ఉండాలి. మనకు అప్పజెప్పిన పని కంటే ఎక్కువ పనిని చేసేతత్వం.

Written By:
  • Srinivas
  • , Updated On : August 30, 2023 / 02:59 PM IST

    ISRO Scientist

    Follow us on

    ISRO Scientist: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఈ సంస్థ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ -3 సక్సెస్ కావడంతో దీనిని ప్రయోగించిన శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరుణంలో వీరి గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. అసలు వీళ్లకు ఇంత నాలెడ్జ్, పట్టుదల ఎక్కడ నుంచి వచ్చాయి? వీరు ఎక్కడ చదువుకున్నారు? అనే చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికే కేరళకు చెందిన ఎంపీ ఇస్రో శాస్త్రవేత్తలు తమ రాష్ట్రంలోని టీకేఎం కళాశాలలో చదువుకున్నారనిచెప్పారు. ఈ నేపథ్యంలో అసలు వాళ్లు ఏం కోర్సు చేశారు? ఎలా చదివారు? అనే ఆసక్తి చర్చ సాగుతోంది.

    జీవితంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలంటే కృషి, పట్టుదల ఉండాలి. అయితే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలంటే కూడా అంతే కసి ఉండాలి. మనకు అప్పజెప్పిన పని కంటే ఎక్కువ పనిని చేసేతత్వం… ఒక ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అహర్నిషలు కష్టపడే విధంగా ఉంటేనే ఇస్రోశాస్త్రవేత్తలుగా రాణిస్తారు. ఇస్త్రోలో ఉద్యోగం పొందాలంటే బేసిగ్గా మ్యాథ్స్ తప్పని సరిగా ఉండాలి. ఇక సైన్స్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఈ రెండు సబ్జెక్టుల్లో ప్రావీణ్యం పొందితేనే అంతరిక్ష శాస్త్రవేత్తలుగా రాణిస్తారు. ప్రపంచంలో అంతరిక్ష రంగానికి పెరుగుతున్న డిమాండ్ తో కొన్ని కొర్సులు అందుబాటులోకి వచ్చాయి.

    చంద్రయాన్ -3 ప్రాజెక్టులో భాగమైన డైరెక్టర్ డాక్టర్ మయిల్ స్వామి ఓ మీడియా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ పూర్తి చేసిన తరువాత డిగ్రీ చదివే వాళ్లు మ్యాథ్స్ తో పాటు సైన్స్ సబ్జెక్టులు ఎంచుకోవాలన్నారు. మ్యాథ్స్ లో అల్జీబ్రా, జామెట్రీ పై పట్టు సాధించాలి. ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థులు IITల్లో బీఈ, బీటెక్ కోర్సులు చేయొచ్చు. జేఈఈ పరీక్షలో మంచి మార్కులు వస్తే తిరువనంతపురం సమీపంలోని వలిమలలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంచుకోవచ్చు. ఇది భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇందులో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్ డీ కోర్సులు చేయడం వల్ల ఇస్త్రో శాస్త్రవేత్తలుగా కొవొచ్చంటున్నారు.

    ఇస్రోలో చేరాలంటే ప్రత్యేకంగా ఈ కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిభ, నైపుణ్యంతో పాటు పట్టుదల ఉన్నవారు ఇస్రోలో ఉద్యోగం పొందవచ్చు. అయితే శాస్త్రవేత్త కావాలనుకునేవారు మాత్రం స్పేస్ టెక్నాలజీని ఎంచుకోవడం వల్ల ముందు నుంచే అంతరిక్షంపై అవగాహన పెరుగుతుంది. ప్రపంచంలో ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ స్టేషన్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. భవిష్యత్ లో మరిన్ని ఏర్పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కావాలనుకునేవారు ఈ రంగంలో రాణించవచ్చు.