https://oktelugu.com/

Car Loan: కారు లోన్ తీసుకోవడానికి ఏ బ్యాంకు బెటర్? ఎందులో తక్కువ వడ్డీ విధిస్తున్నారు?

దేశీయ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ కార్ల లోన్ ను తక్కువ వడ్డీకే అందిస్తోంది. ఈ బ్యాంకులో కారు లోన్ తీసుకోవాలంటే 8.8 శాతం నుంచి 9.7 శాతం వరకు వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 1, 2023 / 12:51 PM IST

    Car Loan

    Follow us on

    Car Loan: కారు కొనుక్కోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అయితే కారు కొనేంత డబ్బ అందరి వద్ద ఉండకపోవచ్చు. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు కారు కొనేందుకు లోన్లు ఇస్తుంటాయి. కార్ల కొనుగోలుపై ఇచ్చే లోన్లపై బ్యాంకులు దాదాపు తక్కువ వడ్డీనే విధిస్తాయి. అంతేకాకుండా బ్యాంకు ఖాతాదారుల ట్రాన్షాక్షన్, సిబిల్ స్కోరు ఆధారంగా వడ్డీని మరింత తగ్గించే అవకాశం ఉంది. ఇటీవల కొన్ని బ్యాంకులు తమ బ్యాంకు ద్వారా లోన్ తీసుకునేందుకు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ బ్యాంకు నుంచి కారు లోన్ తీసుకుంటే బెటర్ అనేది కీలకంగా మారింది. మరి తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకు ఏదో చూద్దాం..

    దేశీయ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ కార్ల లోన్ ను తక్కువ వడ్డీకే అందిస్తోంది. ఈ బ్యాంకులో కారు లోన్ తీసుకోవాలంటే 8.8 శాతం నుంచి 9.7 శాతం వరకు వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది క్రెడిట్ స్కోరు బాగా ఉంటేనే ఈ వడ్డీ వర్తిస్తుంది. లోన్ తీసుకునేవారి సిబిల్ స్కోర్ బాగుంటే మరింత వడ్డీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కారు కొంటే మాత్రం 8.65 నుంచి 9.35 శాతం వరకు చెల్లించాలి. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు విషయానికొస్తే కారుల లోన్ వడ్డీ 8.3 నుంచి 11 వరకు వడ్డీ రేటు విధిస్తోంది. ఇది 12 నుంచి 84 నెలల వరకు వర్తిస్తుంది. 24 నెలల తరువాత జీరో ఫోర్ క్లోజర్ బెనిఫిట్ అందిస్తోంది.

    బ్యాంక్ ఆఫ్ బరోడా తక్కువ వడ్డీకే కారు లోన్ అందిస్తోంది. ఈ బ్యాంకులో 8.75 నుంచి 11.2 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. అలాగే ప్లోటింగ్ వడ్డీ రేటు ఆధారంగా చూస్తే కారు రుణాలపై 8.85 నుంచి 12.15 శాతం వరకు వడ్డీ పడుతుంది. అయితే బ్యాంకు ప్రాసెసింగ్ మాత్రం రూ.1500 విధిస్తుంది. కోటక్ మహీంద్ర బ్యాంకు నుంచి వడ్డీ రేటు 7.7 శాతం ప్రారంభం అవుతుంది. గరిష్టంగా 25 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఈ వడ్డీ రేటుతో ఒక సంవత్సరం నుంచి 7 ఏళ్ల వరకు టెన్యూర్ ను పెట్టుకోవచ్చు.

    ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కారు లోన్ పొందాలంటే వడ్డీ రేటు 10 శాతం విధిస్తుంది. క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన వడ్డీ రేటు మారుతుంది. కారు రుణానికి 112 నెలల నుంచి 35 నెలల పాటు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అదే 36 నెలల నుంచి 96 నెలల వరకు కాల పరిమితిని విధించుకుంటే 8.9 శాతం వడ్డీ రేటు విధిస్తారు. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తే 11.25 శాతం వడ్డీ రేటును విధిస్తారు. ఈ క్రమంలో ఖాతాదారులకు అనుగుణంగా ఉండే బ్యాంకును ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవడం బెటర్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.