Tips for Youth: నేటి యువకులే రేపటి ఆదర్శ పౌరులు అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఈ పౌరులు దేశానికి ఉపయోగపడేలా.. కుటుంబానికి పనికి వచ్చేలా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది యువకులను చూస్తే అలా అనిపించడం లేదు. వీరు జీవితం కోసం కాకుండా ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తున్నారు. సినిమాల, షికార్లు అంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. అయితే మిగతావారు మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటున్నారు. ఈ లక్ష్యంలో భాగంగా వీరు ఏం చేస్తున్నారో తెలుసా?
AI Tools:
ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లో Artificial Intelligence (AI) ఎంట్రీ ఇస్తోంది. దీంతో భవిష్యత్తు మొత్తం ఏఐ మీద ఆధారపడే ఉండే అవకాశం ఉంది. దీంతో చాలామంది యువకులు ఏఐని ఎక్కువగా నేర్చుకుంటున్నారు. గూగుల్లో ఏఐ టూల్స్ కోసం సెర్చ్ చేసే వారిని సంఖ్యా పెరిగిపోతుంది. ఏఐ ద్వారా ఎలాంటి వర్క్ అయినా ఈజీగా చేసుకునే అవకాశం ఉండడంతో చాలామంది దీనికోసం ఆరాటపడుతున్నారు. కొందరు దీనిని ఆన్లైన్లో నేర్చుకుంటుండగా.. మరికొందరు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు.
Small Business:
నేటి కాలం యువత ఎక్కువగా ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తున్నా.. కొంతకాలం తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. చిన్న వ్యాపారమైన సరే సొంతంగా చేయాలని పట్టుదలతో ఉంటున్నారు. ఇందుకోసం పెద్దల సలహా తీసుకుంటున్నారు. కొందరు వ్యాపారం మెలకువలు నేర్చుకున్న తర్వాత ఇందులోకి దిగితే.. మరికొందరు ఏ అనుభవం లేకుండానే వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
వీడియోస్ క్రియేట్ చేయడం:
ఇప్పుడు ఎక్కువగా ఇంస్టాగ్రామ్ వీడియోస్ కు ట్రెండు నడుస్తోంది. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో డబ్బు సంపాదన ఎక్కువగా రావడంతో అందరూ దీనిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. తమకున్న ప్రతిభను వీడియోల రూపంలో చూపించి ఎదుటివారిని ఆకట్టుకోవడంతో అవి వైరల్గా మారుతున్నాయి. ఈ వీడియోల వల్ల అనేక రకాలుగా ఉపాధిని పొందుతున్నారు.
Also Read: ఉపాధ్యాయులకు సరైన సంతృప్తి ఎక్కడ లభిస్తుందో తెలుసా?
కెరీర్ పై ఫోకస్:
కొంతమంది చదువు పూర్తిగాగానే అక్కడితో ఆగిపోయి ఆపివేయకుండా.. పై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పటివరకు లేని కొత్త కోర్సులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎవరు తీసుకొని.. ఎవరు చేయలేని వాటిని నేటి యువత చేసేందుకు ముందుకు వస్తున్నారు.
ఈ విధంగా కొంతమంది యూత్ తమ భవిష్యత్తు గురించి అనేక రకాలుగా ప్లాన్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సమయాన్ని వృధా చేస్తున్నారు. ఓటిటి మూవీస్, ఫ్రెండ్స్ తో జాలీగా ఉండడం.. బర్త్డే పార్టీస్ వంటివి ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కాలక్షేపం కోసం వీకెండ్ లేదా మంత్ ఎండింగ్ లో కేటాయించడం వరకు ఓకే. కానీ ప్రతిరోజు ఇలాంటి వ్యసనాల వల్ల జీవితం నాశనం అవుతుందని కొందరు మానసిక నిబంధనలు తెలుపుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటినుంచే ప్రతిభకు సాన పెడితే అప్పటివరకు జీవితం ప్రశాంతంగా సాగుతుంది.