Hair Oil: మనం వాస్తు పద్ధతులు పాటిస్తాం. ఇంట్లో ప్రతికూల శక్తులు నిలవకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలు చేస్తుంటాం. మనకు తెలియకుండా చాలా తప్పులు చేస్తాం. అది తప్పు అని మనకు తెలియదు. కానీ చేస్తుంటాం. అది తప్పు అని తెలిస్తే దూరంగా ఉంటాం. దాని వల్ల ప్రమాదం అని అవగాహన ఉంటే వదిలిపెడతాం. కానీ తెలిసే వరకు దాంతోనే ఉంటాం. ఇలా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి.
మనం సాధారణంగా జుట్టుకు నూనె రాసుకుంటాం. అది ఎప్పుడు పడితే అప్పుడే రాస్తాం. ఎందుకంటే మనకు తెలియదు ఎప్పుడు రాసుకోవాలో అని. దీంతో మనకు ఎన్నో అనర్థాలు వస్తాయనే విషయం మనకు అంతుబట్టదు. ఎవరైనా చెబితే ఓహో అని మనకు నచ్చితే వదిలేస్తాం. లేదంటే ఆ అలాగే చెబుతారని అదే అలవాటును కొనసాగిస్తాం.
కానీ ఇందులో కూడా మనకు నష్టాలు తీసుకొచ్చే విషయాలు చాలా ఉన్నాయని గుర్తుంచుకోండి. తలకు నూనె ఎప్పుడు పడితే అప్పుడు రాయకూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు. అలాగే కొందరు పడుకునే సమయంలో తలకు నూనె రాసుకుని పడుకుంటారు. ఇది జ్యేష్ట దేవిని మన ఇంట్లోకి పిలవడమే అంటారు.
ఇంకా మంగళవారం, శుక్రవారం తలకు అసలు నూనె పెట్టుకోకూడదు. మంగళవారం కుజుడికి ఇష్టమైన రోజు కావడంతో తలకు నూనె రాసుకోవద్దు. మంగళవారానికి కుజుడు అధిపతి. అందుకే ఈ రోజు రాసుకోవద్దు. శుక్రవారం కూడా తలకు నూనె రాసుకోవద్దు. మహాలక్ష్మి శుక్రుడికి ఇష్టం. ఈ రోజు శనికి సంకేతం. అందుకే ఈ రోజు కూడా నూనె రాసుకోవడం మంచిది కాదు.