Rakhi Festival 2023: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ప్రతీ సోదరి తన సోదరుడికి తనకు రక్షగా ఉండాలని ఈరోజు రాఖీ కడుతుంది. ఒకప్పుడు కేవలం దారాలతో మాత్రమే రక్ష కట్టి రాఖీ పండుగను నిర్వహించుకునేవారు. కానీ ఇప్పుడు విభిన్న తరహాలో రాఖీలు వస్తున్నాయి. వెండి రాఖీలు కూడా మార్కెట్లో లభ్యం కావడంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతీ ఏడాది శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ వేడుకలు నిర్వహించుకునేవారు. కానీ ఈసారి మాత్రం ఏ రోజు రాఖీ పండుగ చేసుకోవాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. అందుకు పౌర్ణమి గడియల్లో తేడాలు ఉండడమే. బుధవారం సాయంత్రం పౌర్ణమి మొదలై గురువారం ఉదయం వరకు పూర్తవుతుంది. దీంతో రాఖీ పండుగ ఏరోజు నిర్వాహించుకోవాలి? అనే దానిపై చాలా మందిలో అయోమయం నెలకొంది.
2023 ఆగస్టు 30న రాఖీ నిర్వహించుకోవాలని కొందరు పురోహితులు చెబుతున్నారు. కానీ గురువారం మాత్రమే నిర్వహించాలని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పండితులు తిథి, పౌర్ణమి సమయాన్ని లెక్కించి ఒక అంచనాకు వచ్చారు. అయినా కొందరికి అవగాహన లేకపోవడం వల్ల అసలు రాఖీ పౌర్ణమి బుధవారమా? గురువారమా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. అయితే కొందరు పండితులు సోషల్ మీడియాలో చెప్పిన ప్రకారం రాఖీ పండుగను గురువారం నిర్వహించుకోవాలని చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం..
బుధవారం 30న పౌర్ణమి గడియలు రాత్రి 9.01 సమయంలో మొదలవుతాయి. కానీ ఈ సమయంలో భద్రకాలం ఉందని పురోహితులు చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీ కట్టడం అంత మంచిది కాదని అంటున్నారు. అలా కట్టడం వల్ల రాఖీ కట్టుకునే సోదరునిపై ప్రభావం ఏర్పడుతుందని చెబుతున్నారు. అయితే 30న బుధవారం రాత్రి 9.02 గంటల నుంచి ఆగస్టు 31 ఉదయం 7.05 నిమిషాల లోపు కట్టొచ్చని కొందరు పండితులు చెబుతున్నారు. అంటే గురువారం ఉదయం 8 గంటల లోపు రాఖీ కట్టాలని అంటున్నారు.
అయితే కొందరు పౌర్ణమి పూర్తయ్యాక రాఖీ కట్టడం ఎలా? అనే మరో అనుమానం మొదలైంది. ఈ నేపథ్యంలో కొందరు చెబుతున్న ప్రకారం గురువారం ఉదయం 8 గంటలకు పౌర్ణమి పూర్తయినా ఆరోజు మధ్యాహ్నం 10.50 గంటల నుంచి 11.50.. ఆ తరువాత మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు.. సాయంత్రం 3.45 నుంచి 6.00 గంటల లోపు రాఖీ కట్టుకోవాలని కొందరు అంటున్నారు. అందువల్ల గురువారం మాత్రమే కేటాయించిన సమయాల్లో రాఖీ కట్టుకోవడం శ్రేయస్కరమని చెబుతున్నారు.