https://oktelugu.com/

Rakhi festival : ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడో తెలుసా.. రాఖీ కట్టుకునే ముహూర్తం ఇదే..

భద్రకాలం ఎప్పుడంటే.. ఆగస్టు 30న ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదు,

Written By:
  • NARESH
  • , Updated On : August 9, 2023 9:55 pm
    Follow us on

    Rakhi festival : రక్షాబంధన్‌.. అన్నా చెళ్లెల్ల అనుబంధానికి ప్రతీక. ఈ పండుగ కోసం అక్క, తమ్ముడు, అన్నా, చెళ్లెల్లు ఏడాదిగా ఎదరు చూస్తున్నారు. ఈ ఏడాది అధిక శ్రావణ మాసం రావడంతో రక్షాబంధన్‌ ఒక నెలా ఆలస్యమైంది. తాజాగా రక్షాబంధన్‌కు కౌంట్‌ డౌన్‌ మెుదలైంది. అయితే ఈ ఏడాది పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

    రెండు రోజులు జరుపుకునే అవకాశం..
    ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ పండుగను జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజునే అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు. సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా ఈ ఫెస్టివల్‌ జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్‌ రెండు రోజులు జరుపుకోనున్నారు. ఇది ఆగస్టు 30న ప్రారంభమై.. ఆగస్టు 31 వరకు ఉంటుంది. అయితే రాఖీని శుభముహూర్తంలో కడితేనే సోదరుడికి మేలు జరుగుతుంది.

    భద్రకాలంలో రాఖీ కట్టొద్దు..
    ఈ ఏడాది రాఖీ పౌర్ణమి రోజు భద్రకాలం వస్తుంది. ఈ సమయంలో రాఖీ కట్టొద్దని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో కడితే సోదరుడు అనేక సమస్యలు ఎదుర్కొంటాడని పేర్కొంటున్నారు. రక్షాబంధన్‌ శుభ గడియలు ఆగస్టు 30న రాత్రి 09:01 గంటల ప్రారంభమై.. ఆగస్టు 31 ఉదయం 07:05 వరకు ఉంటుందని తెలిపార. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చని సూచిస్తున్నారు.

    భద్ర కాలం ఎప్పుడంటే..
    ఇక భద్రకాలం ఎప్పుడంటే.. ఆగస్టు 30న ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదు, రాఖీ కూడా కట్టకూడదు. భద్ర ముహూర్తంలో పొరపాటున కూడా రాఖీ కట్టొద్దని పండితులు సూచిస్తున్నారు. లంకాధిపతి రావణుడి సోదరి భద్ర ఈ ముహూర్తంలో రాఖీ కట్టడం వల్లే రాముడి చేతిలో చంపబడ్డాడు. అందుకే ఈ ముహూర్తంలో రాఖీ కట్టడం మంచిది కాదని పేర్కొంటున్నారు.