https://oktelugu.com/

Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక ఆ బాధ తీరినట్లే..

వాట్సాప్ లో మరో అకౌంట్ క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అంటే వాట్పాప్ ఒకే యాప్ లో రెండు నెంబర్ల తో రెండు అకౌంట్లు వాడుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2024 / 04:03 PM IST

    Whatsapp new feature

    Follow us on

    Whatsapp: కమ్యూనికేషన్ వ్యవస్థలో అత్యంత ప్రధానంగా నిలిచే వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తుంటుంది. టెక్ట్స్ మెసేజ్ నుంచి వీడియోల వరకు క్షణాల్లో పంపించుకునే ఏకైక యాప్. అందువల్ల దీనిని కోట్లాది మంది యూజ్ చేస్తున్నారు. యువత మాత్రమే కాకుండా ఉద్యోగులు, వ్యాపారులు ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ ను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ మాతృసంస్థ బెటా ఎప్పటికప్పుడుకొత్త ఫీచర్లను అలరిస్తోంది.

    ఇప్పటి వరకు మొబైల్ లో రెండు సిమ్ లు ఉన్నా.. ఒకే వాట్సాప్ ను వినియోగించే అవకాశం మాత్రమే ఉండేది. రెండో సిమ్ ద్వారా కూడా వాట్సాప్ కావాలంటే క్లోనింగ్ ద్వారా ఉపయోగించేవాళ్లు. కానీ ఇది అత్యంత భద్రత లేదని తేలింది. దీంతో వాట్సాప్ లో మరో అకౌంట్ క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అంటే వాట్పాప్ ఒకే యాప్ లో రెండు నెంబర్ల తో రెండు అకౌంట్లు వాడుకోవచ్చు.

    ఇందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ సెక్షన్ పై యాడ్ అకౌంట్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రెండో అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ప్రొఫైల్ మార్చుకొని ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. ఫ్యామిలీ కోసం ఒక అకౌంట్ ను ఉద్యోగ అవసరాలకు మరో అకౌంట్ ను వాడుకోవడం వల్ల ఈజీ అవుతుంది. ఇప్పటికే టెక్ట్స్ ను హైలెట్ చేస్తూ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన వాట్పాప్ తాజాగా సరికొత్త ఫీచర్ తో అలరిస్తోంది.